పప్పుల్లో ప్రొటీన్లు పుష్కలం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 డైట్‌లో ఉండాల్సిందే..

These Four Lentils Should be in the Diet for Protein
x

పప్పుల్లో ప్రొటీన్లు పుష్కలం.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 4 డైట్‌లో ఉండాల్సిందే..

Highlights

Health Tips: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలు కచ్చితంగా అవసరం.

Health Tips: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావలసిన పోషకాలు కచ్చితంగా అవసరం. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వులు, ఖనిజాలు, మినరల్స్ సమృద్దిగా ఉండాలి. ఇవన్నీ కూరగాయల ద్వారా ఎక్కువగా లభిస్తాయి. వీటి తర్వాత పప్పులలో మాత్రమే ఇది దొరుకుతాయి. అందుకే ప్రతి రోజు ఏదో ఒక పప్పు కర్రీ ఆహారంలో ఉండేవిధంగా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ నాలుగు పప్పుల్లో ఎక్కువగా ప్రొటీన్‌ లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1. కందిపప్పు

కందిపప్పు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇది ప్రోటీన్, బి విటమిన్ల గొప్ప వనరులలో ఒకటిగా చెప్పవచ్చు. తక్కువ కొవ్వు, కేలరీలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కందిపప్పుని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియను మెరుగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

2. పెసరపప్పు

కందిపప్పు తర్వాత ఎక్కువగా ఉపయోగించేది పెసరపప్పు. దీనిని కిచిడీ తయారీకి ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పిండి పదార్థాలకు గొప్ప మూలంగా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులున్నవారికి ఈ పప్పు చాలా మంచిది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.

3. శనగపప్పు

ప్రొటీన్, పీచుతో కూడిన శనగపప్పు మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా సహాయపడుతుంది. ఒక కప్పు శనగపప్పులో తగినంత ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటుంది. శనగపప్పు గుండె రోగులకు, మధుమేహా వ్యాధి గ్రస్థులకు మేలు చేస్తుంది. ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది. అర కప్పు చనా పప్పు మీకు 9 గ్రాముల వరకు ప్రొటీన్‌ని అందిస్తుంది.

4. మసూర్ పప్పు

ఎర్ర కాయధాన్యాలు లేదా మసూర్ పప్పును ప్రధానంగా అనేక ఉత్తర భారత రాష్ట్రాల్లో తింటారు. ఈ పప్పులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, బి6, బి2, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అర కప్పు మసూర్ పప్పు మీకు 9 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories