Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

These Foods Should be in the Diet to Keep the Heart Healthy
x

Health Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Health Tips: ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం విపరీతంగా పెరిగింది.

Health Tips: ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం విపరీతంగా పెరిగింది. రోజు రోజుకి గుండెపోటు కేసులు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం అవసరం. కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాంటి ఆహారాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం.

బ్రోకలీ

బ్రోకలీ గుండెకు చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. బ్రకోలీ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.

బెర్రీస్‌

బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తొలగిస్తాయి.

గింజలు

గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బాదం, వాల్‌నట్‌లు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధించి గుండెను ఆరోగ్యవంతం చేస్తాయి.

టొమాటో

టొమాటోలో పొటాషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. టమోటాలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

అవిసె గింజలు

అవిసెగింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, అనేక మినరల్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగాలు దూరమవుతాయి. ఈ గింజలు గుండెకు చాలా మేలు చేస్తాయి. గుండె రోగులు నానబెట్టిన అవిసెగింజలని తీసుకుంటే చాలా మంచిది.

చియా విత్తనాలు

చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గించడంలో ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చియా సీడ్స్ గుండె రోగులకు చాలా మేలు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories