Omicron: ఒమిక్రాన్ నుంచి తప్పించుకోవాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

These Foods Should be in The Diet for Strong Immunity | Healthy Food Diet
x

Omicron: ఒమిక్రాన్ నుంచి తప్పించుకోవాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Highlights

Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ సమయంలో అందరు జాగ్రత్తగా ఉండటం అవసరం.

Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. ఈ సమయంలో అందరు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. మరోవైపు కరోనా కేసులు కూడా అధికమవుతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటం చాలా మఖ్యం. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఇది యాంటీబాడీలను కలిగి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్ లేదా పరాన్నజీవి వంటి హానికరమైన వాటని నాశనం చేస్తుంది. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

వెల్లుల్లి

పచ్చి వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో తగినంత మొత్తంలో అల్లిసిన్, జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఎ, ఈ ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. మీరు ఉదయం నీటితో ఔషధంగా తినవచ్చు. ఆహారంతో కలుపుకొని కూడా తినవచ్చు. ఇది కాకుండా బ్రకోలీ, ఉసిరికాయ, క్యాబేజీ, పచ్చి కొత్తిమీర, క్యాప్సికమ్, పాలకూర మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

ఆమ్ల ఫలాలు

నారింజ, జామ, నిమ్మ, ఉసిరి, కివీ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి లభిస్తుంది. ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఓమిక్రాన్ వంటి ప్రమాదాల నుంచి రక్షించడంతో పాటు కాలానుగుణ జలుబు, జ్వరం మొదలైన వాటి నుంచి కాపాడుతాయి.

కషాయాలు

ఉదయం గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. ఖాళీ కడుపుతో కషాయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని తయారు చేయడానికి గిలోయ్ కర్రను చూర్ణం చేసి నీటిలో కలపండి. తరువాత తులసి ఆకులు, లిక్కోరైస్, నల్ల మిరియాల పొడి, అల్లం, పచ్చి పసుపు కలపండి. తర్వాత నీటిని మరిగించి సగానికి తగ్గించండి. ఆ తర్వాత వడగట్టి గోరువెచ్చగా తాగాలి.

గ్రీన్ టీ

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కాబట్టి గ్రీన్ టీ ప్రతిరోజు తాగండి.

Show Full Article
Print Article
Next Story
More Stories