Health Tips: యువతకి అలర్ట్‌.. హార్మోన్ల సమతుల్యత కోసం ఇవి తినాల్సిందే..!

These Foods Should be in the Diet for Hormonal Balance
x

Health Tips: యువతకి అలర్ట్‌.. హార్మోన్ల సమతుల్యత కోసం ఇవి తినాల్సిందే..!

Highlights

Health Tips: యువత అందంగా ఫిట్‌గా కనిపించడానికి గంటల తరబడి జిమ్‌లో గడుపుతుంటారు.

Health Tips: యువత అందంగా ఫిట్‌గా కనిపించడానికి గంటల తరబడి జిమ్‌లో గడుపుతుంటారు. అయితే జిమ్‌కి వెళ్లే ఉద్దేశ్యం అందరికీ భిన్నంగా ఉంటుంది. కొంతమంది సల్మాన్ ఖాన్ లాగా, మరికొందరు టైగర్ ష్రాఫ్ లాగా బాడీని తయారు చేసుకోవాలనుకుంటారు. కానీ వారిలా ఫిట్‌గా కనిపించాలంటే కష్టపడుతూనే సరైన డైట్‌ మెయింటెన్‌ చేయాలి. కొంతమంది సన్నగా ఉండే వ్యక్తులు జిమ్‌కి వెళ్లి చాలా కష్టపడుతారు. కానీ ఎటువంటి ఫలితం ఉండదు. వారి కండరాలు పెరగకుండా అలాగే ఉంటాయి. దీని వెనుక కారణం హార్మోన్ల అసమతుల్యత మీరు మంచి శరీరాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

1. మూలికలు

మూలికలు శరీరాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతాయి. ఇవి మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యతని కాపాడుతాయి. దీని కారణంగా మీ కండరాలు పెరగడం మొదలవుతుంది.

2. హెర్బల్ టీ

జిమ్‌కి వెళ్లే ముందు శరీరానికి మంచి శక్తి అవసరం. కాబట్టి మీరు పూర్తి ఏకాగ్రతతో పని చేయవచ్చు. దీని కోసం ఉదయం, సాయంత్రం జిమ్‌కి వెళ్లే ముందు గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీతో పోహా లేదా ఉప్మా తీసుకోవచ్చు. ఇది మంచి కార్బోహైడ్రేట్ల జాబితాలోకి వస్తుంది.

3. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్

జిమ్‌కు వెళ్లేవారు ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కానీ సహజమైన ప్రొటీన్లు ఉండే ఆహారాలని మాత్రమే తీసుకోవాలి. గుడ్లు, పనీర్, ఉడికించిన చికెన్, వేరుశెనగ వెన్న, ఉడకబెట్టిన బీన్స్, బ్రోకలీ వంటి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories