Healthy Skin: అందమైన మెరిసే చర్మంకోసం ఈ ఆహారాలు తినాల్సిందే.. అవేంటంటే..?

These Foods Help Keep Your Skin Healthy and Glowing
x

Healthy Skin: అందమైన మెరిసే చర్మంకోసం ఈ ఆహారాలు తినాల్సిందే.. అవేంటంటే..?

Highlights

Healthy Skin: అందమైన మెరిసే చర్మంకోసం ఈ ఆహారాలు తినాల్సిందే.. అవేంటంటే..?

Healthy Skin: చాలా మంది అందమైన చర్మం కోసం మార్కెట్‌లో లభించే అనేక రకాల బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతారు. కానీ ఇవి చర్మానికి హాని కలిగించేలా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతారు. చర్మం అందంగా మెరిసేలా కనిపించాలంటే ముందుగా ఆహారంలో మార్పులు చేయాలి. ఆ తర్వాత సహజసిద్దమైన చిట్కాలని పాటించాలి. చర్మం అందంగా కనిపించేలా చేసే కొన్ని రకాల ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బొప్పాయి : బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. మూసివున్న రంధ్రాలను ఓపెన్‌ చేయడానికి పనిచేస్తుంది. ఇది మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

క్యారెట్ : క్యారెట్ లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది సూర్యుడి కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలని తొలగిస్తుంది. అందుకే క్యారెట్ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది.

బీట్‌రూట్ : బీట్‌రూట్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్‌ను సలాడ్ జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

పాలకూర: పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది చర్మం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. మీరు పాలకూరతో చేసిన కూరలు, సూపులు తాగవచ్చు.

పెరుగు: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. కచ్చితంగా దీనిని డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం అందంగా కనిపించడంలో సహాయపడుతాయి. ముడతలని తొలగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories