Liver Health: ఈ ఆహారాలు లివర్‌ ఫ్రెండ్స్‌.. ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!

These Foods are Liver Friends Reduce the Risk
x

Liver Health: ఈ ఆహారాలు లివర్‌ ఫ్రెండ్స్‌.. ప్రమాదాన్ని తగ్గిస్తాయి..!

Highlights

Liver Health: కాలేయం ఒక పవర్‌హౌస్. ఇది శరీరంలో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్ల నిల్వ వరకు అనేక పనులని చేస్తుంది.

Liver Health: కాలేయం ఒక పవర్‌హౌస్. ఇది శరీరంలో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్ల నిల్వ వరకు అనేక పనులని చేస్తుంది. ఇది ఆల్కహాల్, డ్రగ్స్ వంటి టాక్సిన్స్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం సరైన డైట్‌ పాటించాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. కాఫీ

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అత్యుత్తమ పానీయాలలో కాఫీ ఒకటి. ఇప్పటికే లివర్‌ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీ తాగవచ్చు. ఇది సిర్రోసిస్, లివర్ డ్యామేజ్, లివర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.

2. ద్రాక్ష

ద్రాక్షలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది రెస్వెరాట్రాల్. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయంలో మంటను తగ్గించడం, కాలేయం దెబ్బతినకుండా నిరోధించడం, యాంటీఆక్సిడెంట్ స్థాయిలని పెంచడం చేస్తుంది.

3. బీట్‌రూట్ రసం

బీట్‌రూట్ రసం ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచిది. ఇది కాలేయంలో ఆక్సీకరణ నష్టం,వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగాలి.

4. గింజలు

గింజలలో కొవ్వు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E వంటి అనేక రకాల ఖనిజ, లవణాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు కాలేయానికి కూడా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల ఫ్యాటీ లివర్ ముప్పు తగ్గుతుంది.

5. ఒమేగా -3

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కొవ్వు చేపలలో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి వాపును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా -3 అధికంగా ఉండే కొవ్వు చేపలను తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories