Health: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!

These Foods are Harmful to the Liver
x

Health: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!

Highlights

Health: కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. మనం ఏది తిన్నా, తాగినా నేరుగా మన కాలేయంపై ప్రభావం చూపుతుంది.

Health: కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. మనం ఏది తిన్నా, తాగినా నేరుగా మన కాలేయంపై ప్రభావం చూపుతుంది. ధూమపానం లేదా మద్యపానం చేసే వ్యక్తులు తరచూ కాలేయ సమస్యలని ఎదుర్కొంటారు. అయితే స్మోకింగ్, డ్రింకింగ్ మాత్రమే కాదు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుంటే కూడా లివర్ పాడైపోతుంది. ఏయే ఆహారాల వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారో తెలుసుకుందాం.

మద్యం

ఆల్కహాల్ కాలేయానికి అత్యంత హానికరం. ఇది మీకు ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.

కొవ్వు పదార్ధాల వినియోగం

కొవ్వు పదార్ధాలు కాలేయానికి హానికరం. వేయించిన ఆహారాన్ని తినడం, అధిక కేలరీలు, అధిక సంతృప్త ఆహారం, మీ కాలేయంలో వాపును ప్రోత్సహిస్తుంది. దీని కారణంగా కాలేయంపై చెడు ప్రభావం చూపుతుంది. క్రమంగా కొత్త కొత్త వ్యాధులు సంభవిస్తాయి.

చక్కెర

ఎక్కువ చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే కాలేయం పని చక్కెరను కొవ్వుగా మార్చడం. మీరు ఎక్కువ చక్కెరను తింటే కాలేయం అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వును తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే కాలేయ వ్యాధి సంభవిస్తుంది.

జంతు ఉత్పత్తులు

జంతు ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ మీరు వాటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వీటిలో ఎక్కువగా సంతృప్త కొవ్వు ఉంటుంది. అందుకే పరిమితంగా తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ 2-3 గ్లాసుల పూర్తి కొవ్వు పాలను చేర్చుకుంటే అది కాలేయం పనిని మరింత పెంచుతుంది. ఇది మీ కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories