Bad Cholesterol: చెడు కొవ్వుని తగ్గించుకోవాలంటే ఈ డ్రైఫ్రూట్స్‌ తినాల్సిందే..!

These Dried Fruits are the Best Way to Reduce Bad Cholesterol | Weightloss Tips
x

Bad Cholesterol: చెడు కొవ్వుని తగ్గించుకోవాలంటే ఈ డ్రైఫ్రూట్స్‌ తినాల్సిందే..!

Highlights

Bad Cholesterol: నేటి జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేకపోతున్నారు...

Bad Cholesterol: నేటి జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేకపోతున్నారు. కొలెస్ట్రాల్‌, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధులకి దూరంగా ఉండవచ్చు. కానీ చాలామంది ఇవి వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. ఒక్కసారి ఇవి వచ్చాక మందులు కచ్చితంగా వాడాల్సిందే. సాధారణంగా శరీరంలో పెరిగే అధిక కొవ్వువల్లే ఈ రోగాలు చుట్టుముడుతాయి. అందుకే ఆ కొవ్వుని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.

మీరు కొన్ని ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. వాల్‌నట్‌లు, బాదంపప్పులు, పిస్తాపప్పులని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి మీరు వాల్‌నట్‌లను తినవచ్చు. వీటివల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఫిట్‌గా ఉండాలంటే రోజూ బాదంపప్పు తినాలని వైద్యులు సూచిస్తారు.

బాదంపప్పులో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను తయారు చేస్తాయి. మీరు రోజూ పిస్తాపప్పులు కూడా తినాలి. కొన్ని పిస్తాపప్పులు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పిస్తాపప్పులని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మీరు అవిసె గింజలను కూడా ఉపయోగించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories