ఈ ఆహారపు అలవాట్ల వల్ల తొందరగా వృద్ధాప్యం.. ఈ రోజే డైట్‌ నుంచి తొలగించండి..!

These Bad Eating Habits Lead To Early Aging Eliminate Them From Your Diet Today
x

ఈ ఆహారపు అలవాట్ల వల్ల తొందరగా వృద్ధాప్యం.. ఈ రోజే డైట్‌ నుంచి తొలగించండి..!

Highlights

Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది చెడు అలవాట్లకి బానిసలుగా మారుతున్నారు.

Health Tips: నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది చెడు అలవాట్లకి బానిసలుగా మారుతున్నారు. దీనివల్ల సమయాని కంటే ముందుగానే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నారు. ఏ వ్యక్తి అయినా చాలా కాలంపాటు యవ్వనంగా ఉండాలని కోరుకుంటాడు కానీ వారి అలవాట్లే వారిని ముసలివారిలా మారుస్తున్నాయి. ఇలా జరగకూడదంటే రోజువారీ డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. కచ్చితంగా కొన్ని చెడు పదార్థాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఫ్యాడ్ డైట్

ప్రస్తుత కాలంలో వెయిట్ లాస్ డైట్ పేరుతో అనేక రకాల ఫ్యాడ్ డైట్ లు అమ్ముతున్నారు. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫ్యాడ్ డైట్‌లు అనేవి రకరకాల డైట్‌ ప్లాన్‌లు. ఇందులో కొన్ని పోషకాలు జోడించి మరికొన్నింటిని వదిలేస్తారు. హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో కొన్ని పోషకాలు పెరుగుతాయి అలాగే కొన్ని అవసరమైన పోషకాలు తగ్గుతాయి. దీని కారణంగా శరీరం అనేక రకాల నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

చక్కెర వినియోగం

చక్కెర ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్‌కి నష్టం జరుగుతుంది. అధిక మోతాదులో చక్కెర చర్మ సమస్యలను కలిగిస్తుంది. మీకు తీపి తినాలని అనిపిస్తే పండు లేదా డార్క్ చాక్లెట్ తినండి. ఫ్రైడ్ ఫుడ్ చర్మాన్ని బలహీనపరిచే ఫ్రీ రాడికల్స్‌ను విడుదల చేస్తుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్ పొటాటో ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.

ఆల్కహాల్, సోడా, కాఫీలు

ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల చర్మం తొందరగా ముడతలు పడుతుంది. ఇది విటమిన్ ఎతో సహా కొన్ని పోషకాల లోపాలకు దారితీస్తుంది. అలాగే సోడా, కాఫీ తాగడం వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. అలాగే నిద్రలేమి సమస్యకు దారి తీస్తుంది. దీనివల్ల వృద్ధాప్యం, ముడతలు, నల్లటి వలయాలు ఏర్పాడుతాయి. కెఫిన్ ఉన్న పానీయాలను వీలైనంత తక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది. అలాగే వైట్ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగ వంతం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories