Health: కారం ఎక్కువగా తింటున్నారా.? శరీరంలో జరిగే మార్పులివే..

These are the side effects with eating chilli powder
x

Health: కారం ఎక్కువగా తింటున్నారా.? శరీరంలో జరిగే మార్పులివే.. 

Highlights

అయితే కారం ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా కారం ఉండాల్సిందే. కారం లేకుండా ఏ వంటకాన్ని ఊహించుకోలేము. ఇక కొందరైతే మరీ కారంగా తింటుంటారు. హోటల్‌కు వెళ్లిన సమయంలో స్పైసీగా ఇవ్వమని కోరి మరీ తింటుంటారు. అయితే కారం ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో కారం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కారం ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కారంలో ఉండే కొన్ని గుణాలు రక్తనాళాలు సంకోచించేలా చేస్తాయి. ఈ కారణంగా రక్తపోటు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది గుండెపోటుకు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* కారం ఎక్కువగా తీసుకుంటే వచ్చే ప్రధాన సమస్యల్లో అల్సర్‌ ఒకటి. మోతాదుకు మించి కారం తినడం వల్ల అల్సర్ వస్తోంది. అల్సర్‌ కారణంగా పొట్టలో పుండ్లు ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

* జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా కారం ఎక్కువగా తీసుకోవడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కారం ఎక్కువగా తీసుకుంటే.. కడుపులో మంట గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు విరేచనాలు, వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.

* కారం ఎక్కువగా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కారం అతిగా తినే వారిలో చర్మంపై దురదగా ఉండడం, చర్మం ఎర్రబడడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

* కారం ఎక్కువగా తినడం వల్ల కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కారాన్ని ఎక్కువగా తినడం వల్ల కంట్లో నుంచి నీళ్లు వస్తుంటాయి. కళ్లలో దురద వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్నేళ్లు ఇలాగే కొనసాగితే.. కళ్ళు మసకబారే అవకాశాలు కూడా ఉన్నాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories