Health Tips: మంచివని ఖర్జూరాలు అధికంగా తింటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

These are the Side Effects With Eating Excess Dates
x

Health Tips: మంచివని ఖర్జూరాలు అధికంగా తింటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

Highlights

Dates: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో పోషక విలువలు ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Dates: ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో పోషక విలువలు ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఖర్జూరాలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అన్ని విధాల మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు బీపీ, గుండె ఆరోగ్యం వంటి సమస్యలను దరిచేరనివ్వడకుండా కాపాడడంలో ఖర్జూర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి మంచి చేసే ఈ ఖర్జూరాలతో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? మోతాదుకు మించి ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకుంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

సాధారణంగానే ఖర్జూరాల్లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ పేషెంట్స్‌కి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి హైపోగ్లైసీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక ఖర్జూరాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. దీంతో ఊబకాయం బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఖర్జూరాలను మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ఖర్జూరాలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుందని తెలిసిందే. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కొందరిలో ఖర్జూరాలను అధికంగా తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం ఎరుబడడం, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఖర్జూరాలను మోతాదుకు మించి తీసుకుంటే దంత సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఖర్జూరాల్లో ఉండే అధిక చక్కెర కంటెంట్‌ దంతాలపై ప్లాక్ పేరుకుపోయి దంతాలు క్షీణించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే రీడర్స్‌ భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories