Health: ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటున్నారా.? తీవ్ర సమస్యలు తప్పవు..

These are the side effects of eating bread with empty stomach
x

Health: ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటున్నారా.? తీవ్ర సమస్యలు తప్పవు..

Highlights

Health: బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఒక్కసారిగా కేలరీలు పెరగడానికి కారణమవుతుంది.

Health: ఉదయం టిఫిన్‌ చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్‌ చేస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే కచ్చితంగా ఉదయం టిఫిన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే మనలో కొందరు ఉదయం సమయం లేకో మరే కారణంతోనో త్వరగా టిఫిన్‌ చేసేయాలనే ఆతృతతో ఉంటారు.

అలాంటి వారు ఇన్‌స్టాంట్‌ ఫుడ్‌కు మొగ్గు చూపుతారు. ఇలాంటి వాటిలో ప్రధానమైంది బ్రెడ్‌. చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా పాలలో బ్రెడ్‌ను ముంచుకొని తింటుంటారు. అయితే పరగడుపున బ్రెడ్‌ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. జామ్‌ను ఖాళీ కడుపుతో ఏ రకంగా తీసుకున్నా అనర్థాలు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ పరగడుపున బ్రెడ్‌ను తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఒక్కసారిగా కేలరీలు పెరగడానికి కారణమవుతుంది. ఇందులో తక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే ఉదయం బ్రెడ్‌ తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు లభించవచ్చు. ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాలక్రమేణ ఇది టైప్‌ 2 డయాబెటిస్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇక బ్రెడ్‌లో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఉబ్బరం, ఇతర జీర్ణ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరగడుపున సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. గ్రెయిన్స్ ఫుడ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, బ్రెడ్‌లో ఫోలేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. కానీ ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తీసుకుంటే ప్రమాదమని చెబుతున్నారు. ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తీసుకుంటే.. బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది శరీరంలో కేలరీలను పెంచడంతో పాటు బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇక ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల మలబద్ధకం సమస్య వేధిస్తుందని నిపుణులు అంటున్నారు. బ్రెడ్‌లో అధికంగా ఉండే పిండి దీనికి కారణంగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories