Almonds: బాదం తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా.? నిపుణులు ఏమంటున్నారు..

These are the Side Effects With Almonds
x

Almonds: బాదం తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా.? నిపుణులు ఏమంటున్నారు..

Highlights

Almonds: బాదం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Almonds: బాదం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు సైతం ప్రతీ రోజూ బాదంను తీసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన బాదంను ఉదయం తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుందని తెలిసిందే. అయితే ఆరోగ్యానికి మేలు చేసే బాదం కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఇబ్బందులతో బాధపడేవారు బాదంకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బాదంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు బాదంకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. బాదం పప్పులో ఆక్సలేట్ ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

* ఇక రక్తపోటు సంబంధిత మెడిసిన్‌ ఉపయోగిస్తున్న వారు కూడా బాదం పప్పు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. బాదంలో పుష్లంగా ఉండే మాంగనీస్ రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది.

* జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా బాదంకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.

* బాదంలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది తలనొప్పి, అలసట, మైకం వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. మైగ్రేన్‌ వంటి సమస్యలతో బాధపడేవారు బాదంకు దూరంగా ఉండడమే మంచిది.

* బరువు తగ్గాలనుకునే వారు కూడా బాదంకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బాదంలో అధిక కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇది ఊబకాయాన్ని మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories