Health: ఆల్కహాల్‌ మాత్రమే కాదు, ఇది కూడా లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది..!

These are the reasons for non alcoholic fatty liver disease, check here for more details
x

Health: ఆల్కహాల్‌ మాత్రమే కాదు, ఇది కూడా లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Highlights

నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌కు (NAFLD) చక్కెర ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు.

Health: ఆల్కహాల్‌ లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోతాదుకు మించి మద్యం తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసిందే. అయితే కేవలం ఆల్కహాల్ మాత్రమే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా లివర్‌ ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌గా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ సమస్య బారిన పడుతున్నారు.

నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌కు (NAFLD) చక్కెర ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, షుగర్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. తీసుకునే ఆహారంలో ఫ్రక్టోజ్‌ ఎక్కువైతే.. అది కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది డి నోవో లిపోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది, నాన్ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ ముఖ్య లక్షణంగా చెప్పొచ్చు. అధిక ఫ్రక్టోజ్ ఆహారాలు కాలేయ వాపుతో పాటు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి, ఇది కాలేయ ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తుంది.

చక్కెర ఎక్కువగా తీసుకోవడానికి నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ హెపటాలజీలో ఈ విషయాలను ప్రచురించారు. NAFLD ఉన్న వ్యక్తులు వ్యాధి లేని వ్యక్తుల కంటే ఎక్కువ ఫ్రక్టోజ్‌ను వినియోగిస్తున్నారని పరిశోధకులు గుర్తించారు. అధిక ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల కొవ్వు పదార్ధాలు పెరగడం, కాలేయంతో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని మరొక అధ్యయనంలో చక్కెర తీసుకోవడం తగ్గించడం, ముఖ్యంగా ఫ్రక్టోజ్, కాలేయ కొవ్వు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఫ్రక్టోజ్ పెరగడానికి ప్రధాన కారణాల్లో సోడా, పండ్ల రసం వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, చక్కెర పానీయాలు తక్కువగా తాగే వారి కంటే ఎక్కువ మొత్తంలో చక్కెర పానీయాలు తీసుకునే వ్యక్తులు NAFLD సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories