Women Health: హార్మోన్ల అసమతుల్యతకు ఇవే కారణాలు.. ఈ అలవాట్లు వదిలేస్తే మేలు..!

These are the reasons for Hormonal imbalance in women It is Better to Leave these Habits
x

Women Health: హార్మోన్ల అసమతుల్యతకు ఇవే కారణాలు.. ఈ అలవాట్లు వదిలేస్తే మేలు..!

Highlights

Women Health: మానవ శరీరంలో కొన్ని పనులు జరగాలంటే హార్మోన్స్‌ అవసరం ఉంటుంది. ఒక్కో హార్మోన్‌ ఒక్కో పని జరగడానికి సాయం చేస్తుంది.

Women Health: మానవ శరీరంలో కొన్ని పనులు జరగాలంటే హార్మోన్స్‌ అవసరం ఉంటుంది. ఒక్కో హార్మోన్‌ ఒక్కో పని జరగడానికి సాయం చేస్తుంది. మహిళలు తరచుగా హార్మోన్స్‌ అసమతుల్యతతో బాధపడుతుంటారు. వీరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్, గర్భం వంటి విషయాల్లో చాలా మార్పులు ఉంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, సోమరితనం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత జరుగుతుంది. స్త్రీలు తమ శరీరంలోని చిన్న చిన్న మార్పులను తరచుగా పట్టించుకోరు మరియు దీని కారణంగా అనేక చిన్న ఆరోగ్య సమస్యలు పెద్ద వ్యాధులుగా మారుతాయి. మహిళలు హార్మోన్ల అసమతుల్యతకు గురైతే PCOD, PCOS, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు గురవుతారు. అందుకే హార్మోన్ల అసమతుల్యత లక్షణాలపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు

ఏదైనా హార్మోన్ పరిమాణంలో పెరుగుదల లేదా తగ్గుదలని హార్మోన్ల అసమతుల్యత అంటారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆకస్మికంగా బరువు పెరగడం, నిద్ర విధానంలో మార్పు, పీరియడ్స్ సక్రమంగా రాకోపోవడం, అధిక రక్తస్రావం, ఎప్పుడూ అలసట, మూడ్ బాగాలేకపోవడం, తలనొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి.

కెఫిన్ కంటెంట్ తగ్గించండి

కాఫీ, టీ మొదలైన వాటిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. దీని కారణంగా కార్టిసాల్ పరిమాణం పెరగడం మొదలవుతుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత సమస్యతో సతమతమవుతున్న వారు టీ, కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండి

ప్రస్తుతం ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌ తినే ట్రెండ్‌ బాగా పెరిగింది. ఈ ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లను అధికంగా వాడుతున్నారు. దీని కారణంగా హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ఆరోగ్యానికి అనేక రకాల హాని చేస్తుంది. కాబట్టి వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి.

సోయా ఉత్పత్తులను నివారించండి

ప్రోటీన్-రిచ్ సోయా ఉత్పత్తులు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అయితే ఇది అధిక మొత్తంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యతో పోరాడుతున్న వ్యక్తులు వారి ఆహారంలో సోయా ఉత్పత్తులను తగ్గించాలి.

పొరపాటున వీటి జోలికి పోవద్దు

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి విషంతో సమానం. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారు పొరపాటున కూడా వీటి జోలికి పోవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories