Parents Mistakes: పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఇవే..!

These are the Mistakes That Parents Make in the Case of Children
x

Parents Mistakes: పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు ఇవే..!

Highlights

Parents Mistakes: నేటి కాలంలో పిల్లలను పెంచడం అంత తేలికైన పని కాదు.

Parents Mistakes: నేటి కాలంలో పిల్లలను పెంచడం అంత తేలికైన పని కాదు. మీరు పిల్లలతో ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా ఇతరులతో అలాగే ప్రవర్తిస్తారు. నేటి బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు పిల్లలని పెంచడానికి సమయం దొరకడం లేదు. ఈ పరిస్థితిలో పిల్లలు అధ్వానంగా మారుతున్నారు. పిల్లల విషయంలో గమనించే కొన్ని విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1.ఫోన్‌ మినహాయింపు

కరోనా తర్వాత చాలామంది పిల్లలు ఫీల్డ్‌లో ఆడటానికి బదులుగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్‌లలో గేమ్‌లు ఆడటానికి ఇష్టపడుతున్నారు. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గేమ్‌లు ఆడేందుకు ఇష్టపడని పిల్లలు యూట్యూబ్‌లో గంటల తరబడి వీడియోలు చూస్తుంటారు. దీని కారణంగా పిల్లల కళ్ళు, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. వారి భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్లిపోతుంది.

2.బోధనకు బదులు తిట్టడం

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నపాటి విషయాలకి తిట్టడం లేదా కొట్టడం చేస్తారు. దీంతో పిల్లవాడు ఏమి అడగడానికి భయపడతాడు. తల్లిదండ్రుల అరుపులు పిల్లల్ని మరింత కోపంగా మారుస్తుంది.

3.ఓపిక లేకపోవడం

నేటి తరం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అలవాటు ఓపిక. ఈ విషయంలో మొదట తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. తర్వాత పిల్లలని ఓపికగా ఎలా ఉండాలో నేర్పించండి. భవిష్యత్‌లో పిల్లలకి ఇది చాలా అవసరం.

4.గెలవాలనే ప్రేరణ

నేటి యుగం కంప్యూటర్‌ యుగం. పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అయితే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు గెలవాలని కోరుకుంటారు. ఇలా చేయడం తప్పు కాదు. కానీ ఓటమి పరిస్థితిని ఎదుర్కోవడం కూడా నేర్పించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఓటమి నుంచి నేర్చుకోవడం పిల్లల పెరుగుదల, అభివృద్ధికి అవసరమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories