Soaked Walnut: నానబెట్టిన బాదమే కాదు, వాల్‌నట్స్‌తో కూడా ఎన్నో లాభాలు.. అవేంటంటే

These are the health benefits with soaked walnuts in telugu
x

 Soaked Walnut: నానబెట్టిన బాదమే కాదు, వాల్‌నట్స్‌తో కూడా ఎన్నో లాభాలు.. అవేంటంటే

Highlights

అయితే కేవలం బాదం మాత్రమే కాకుండా, నానబెట్టిన వాల్‌నట్స్‌తో కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Soaked Walnut: సాధారణంగా నానబెట్టిన బాదం గురించి మనకు ఎక్కువగా తెలిసి ఉంటుంది. బాదంను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉంటాయని తెలిసిందే. అయితే కేవలం బాదం మాత్రమే కాకుండా, నానబెట్టిన వాల్‌నట్స్‌తో కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ నానబెట్టిన వాల్‌నట్స్‌ ద్వారా కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మెదడు పనితీరు మెరుగుపరచడంలో వాల్‌నట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నానబెట్టిన వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. వయసురీత్యా వచ్చే మెదడు సమస్యలను దూరం చేస్తుంది.

* నానబెట్టిన వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల ఒమేగా ఫ్యాటీ 3 ఆసిడ్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాదు మంచి కొలెస్ట్రాయిల్ స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యాన్ని ప్రేరపిస్తాయి.

* బరువు తగ్గాలనుకునే వారు నానబెట్టిన వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే ప్రోటీన్ ఫైబర్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయనివ్వదు. దీంతో క్యాలరీలు అతిగా తినడం తగ్గిస్తాం.

* మెరుగైన జీర్ణక్రియకు కూడా నానబెట్టిన వాల్‌నట్స్‌ ఉపయోగపడతాయి. వాల్‌ నట్స్‌లో పుష్కలంగా లభించే ఫైబర్ మంచి జర్ణక్రియకు ప్రేరేపిస్తాయి.

* ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడంలో నానబెట్టిన వాల్‌ నట్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని మెగ్నీషియం, ఫాస్పర్‌ ఎములక ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

* వాల్‌నట్స్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లకు పెట్టింది పేరు. ఇందులోని విటమిన్‌ ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతం చేస్తుంది. ముఖ్యంగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

* డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా నానబెట్టిన వాల్‌నట్స్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వవు. డయాబెటీస్‌తో బాధపడేవారు నానబెట్టిన వాళ్లనే ఉదయం ఒకటి చొప్పున తీసుకున్న ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories