Health: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తీసుకోండి.. లాభాలు మీ ఊహకు కూడా అందవు

These are the health benefits with Dates and Ghee combination in telguu
x

Health: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తీసుకోండి.. లాభాలు మీ ఊహకు కూడా అందవు

Highlights

ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ వంటి నేచురల్‌ షుగర్స్‌ శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.

ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతీ రోజూ ఉదయం ఖర్చూరాలను తీసుకోవాలని చెబుతుంటారు. అయితే ఇవే ఖర్జూరాలను నెయ్యిలో కలుపుకొని తీసుకోవడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఖర్జూరాలను, నెయ్యిలో నానబెట్టుకొని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ వంటి నేచురల్‌ షుగర్స్‌ శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతుంది, అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ వచ్చే చిన్న చిన్న వ్యాధులకు దీంతో చెక్‌ పెట్టొచ్చు.

ఇక ఈ రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. సుఖ ప్రసవం కావడానికి దోహదపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యల నివారణకు కూడా నెయ్యి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు పటిష్టంగా మార్చడంతో పాటు, గుండె ఆరోగ్యానికి ఖర్జూరాలు మేలు చేస్తాయి.

ఇంతకీ ఖర్జూరాలను నెయ్యిలో ఎలా నానబెట్టాలంటే. ఇందుకోసం ముందుగా కొన్ని వితనాలు లేని ఖర్జూరాలను తీసుకోవాలి. అనంతరం స్టౌవ్‌ మీద ప్యాన్‌ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరవ్ఆత ఖర్జూరాలు వేసి కాసేపు వేయించుకోవాలి. అనంతరం చల్లారిన తర్వాత నెయ్యితో సహా గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్‌ చేసుకోవాలి. రోజూ ఉదయం ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories