Heart: శరీరంలో ఈ మార్పులా.? వెంటనే అలర్ట్ అవ్వండి గుండె వైఫల్యం కావొచ్చు..

These are the early symptoms of heart problems
x

Heart: శరీరంలో ఈ మార్పులా.? వెంటనే అలర్ట్ అవ్వండి గుండె వైఫల్యం కావొచ్చు..

Highlights

అయితే గుండె వైఫల్యాన్ని మన శరీరం ముందుగానే అలర్ట్‌ చేస్తుంది.

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం ఏదైనా.. గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు కూడా ఉన్నపలంగా కుప్పకూలిపోతున్నారు. అయితే గుండె వైఫల్యాన్ని మన శరీరం ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా గుండె వైఫల్యాన్ని అంచనా వేయొచ్చు. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లు తెలిపే మొదటి లక్షణం అలసట, బలహీనత. వినడానికి ఈ రెండు సాధారణ సమస్యల్లాగే కనిపించినా.. గుండె ఆరోగ్యాన్ని ఇది సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎలాంటి పని చేయకపోయినా నిత్యం అలసటగా ఉంటే మాత్రం గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని అర్థం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఇక గుండె అనారోగ్యాన్ని ముందుగా తెలిపే మరో లక్షణం. కాళ్లు, మోకాళ్లు, చీలమండలంలో కనిపించే వాపు. అందుకే ఈ వాపును అస్సలు లైట్‌ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. గుండె బలహీనంగా మారిన సమయంలోనే ఇలాంటి లక్షణం కనిపిస్తుందని అంటున్నారు.

* గుండె కొట్టుకునే తీరులో మార్పులు కనిపించినా అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. హార్ట్‌ బీట్ వేగంగా పెరగడం, గుండె కొట్టుకునే విధానంలో క్రమ రహితంగా ఉండడం కూడా గుండె వైఫల్యానికి ఒక లక్షణంగా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. గుండె లయ తప్పుతుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు.

* శ్వాస సంబంధిత సమస్యలు కూడా గుండె వైఫల్యానికి ముందస్తు లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం గురకగా ఉండడం వంటివి కూడా దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చేందుకు కారణాలు మారుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. పైన తెలిపిన లక్షణాల్లో ఏది దీర్ఘకాలంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె పోటున బారిన పడకుండా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories