Dengue Fever: భయపెడుతున్న డెంగీ ఫీవర్..మీరు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే

Dengue Fever: భయపెడుతున్న డెంగీ ఫీవర్..మీరు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
x

 Dengue Fever: భయపెడుతున్న డెంగీ ఫీవర్..మీరు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే

Highlights

Dengue Fever:డెంగీ ఫీవర్ కేసులు భయపెడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి ఇన్ఫెక్షన్లు ఆందోళన కలిగిస్తుంటాయి. మీరు చేయాల్సిన, చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Dengue Fever:వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులను మోసుకువస్తుంది. ఈకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ కాలంలో దోమలు ఎక్కువగా అటాక్ చేస్తుంటాయి. దోమలు పెరిగేందుకు కూడా వర్షాకాలం అనువైన వాతావరణం. కొన్ని రకాల దోమలు డెంగీ వైరస్ వ్యాపింపజేస్తుంటాయి. భారతదేశంలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. ఏమాత్రం అలసత్వం వహించిన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే..దీని నుంచి మనం సులభంగా భయటపడవచ్చు. డెంగీ ఫీవర్ రాకుండా ఉండాలంటే ..ఏం చేయాలి..ఏం చేయకూడదు..ఇప్పుడు తెలుసుకుందాం.

చేయాల్సిన పనులు:

వర్షాకాలంలో ఉదయం, సాయంత్రం సమయంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు దోమలను వికర్షించే మస్కిటో రిపెలెంట్స్ ను వాడుతుండాలి. వీటిలో పికారిడిన్, లెమన్, యూకలిప్టస్ వంటి ఆయిల్స్ ఉంటాయి. డెంగీ ఫీవర్ ను వ్యాప్తిచేసే దోమలు ఎక్కువగా నీటిలో పెరుగుతుంటాయి. వర్షాకాలంలో ఇంటి చుట్టూ నీరు స్టోరేజీ లేకుండా చూడాలి. టైర్లు, డబ్బాలు, కూజాలు వంటి వాటిల్లో చేరే వర్షపు నీరు ఎప్పటికప్పుడు పారబోస్తుండాలి. ట్యాంకులు, వాటర్ స్టోరేజీ పాత్రలను మూతతో కప్పి ఉంచాలి. దోమలు కుట్టకుండా ఉండేందుకు పొడవైన స్లీవ్స్ ఉన్న షర్ట్స్, కాళ్లను పూర్తిగా కవర్ చేసే ప్యాంట్స్ సాక్స్ ధరించాలి.

డెంగీ పాజిటివ్ వచ్చినట్లయితే..ఫీవర్ వచ్చినప్పుడు శరీరం నీటిని కోల్పోతుంది. ఈ సమయంలో రోజంతా కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. ఓఆర్ఎస్ డ్రింక్, కొబ్బరి నీళ్లు వంటి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ శరీరానికి కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తాయి. వేడి వేడి సూప్ తాగడం వల్ల శరీరానికి నీరు, పోషకాలు కూడా అందుతాయి. హైఫీవర్, తీవ్రతలనొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు లేదా చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి డెంగీ లక్షణాలు కావచ్చు. వేగవంతమైన రోగనిర్ధారణ, సరైన చికిత్స ఈ జ్వరం నుంచి కోలుకునేందుకు చాలా అవసరం.

ఈ పనులు చేయకూడదు:

డెంగీ ఫీవర్ వచ్చినట్లయితే సొంత వైద్యం చేసుకోకూడదు. సొంతంగా మందులు వాడకూడదు. ఎందుకంటే కొన్ని మందులు ఈ జ్వరం లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు లేదా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లోకి వెళ్లకూడదు. ఎందుకంటే ఇక్కడ డెంగీ వ్యాధిని కలిగించే దోమలు ఉండే ఛాన్స్ ఉంటుంది. డెంగీ వస్తే ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ఒక పరిమితికి మించి ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే బ్లీడింగ్ వంటి సమస్యలు వస్తాయి. డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆస్పిరిన్ లేదా ఐబుప్రోఫెన్ వంటి మందులు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి డెంగీతో బాధపడుతున్న వ్యక్తుల్లో రక్తస్రావం, ఇతర సమస్యలను పెంచుతాయి. ముఖ్యంగా డెంగీ రోగులకు విశ్రాంతి చాలా అవసరం. శారీరక శ్రమ చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories