Women Health: మహిళల్లో కిడ్నీ సమస్యలకి ఇవే కారణాలు.. అస్సలు విస్మరించవద్దు..!

These are the Causes of Kidney Problem in Women Dont Ignore it at all
x

Women Health: మహిళల్లో కిడ్నీ సమస్యలకి ఇవే కారణాలు.. అస్సలు విస్మరించవద్దు..!

Highlights

Women Health: మన శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. ఇవి డ్యామేజ్‌ అయిందంటే శరీర విసర్జన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అయితే కిడ్నీ సమస్యలు సర్వసాధారణంగా మారాయి.

Women Health: మన శరీరంలో కిడ్నీలు ప్రధాన అవయవాలు. ఇవి డ్యామేజ్‌ అయిందంటే శరీర విసర్జన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అయితే కిడ్నీ సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం వారు ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడమే. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మహిళల్లో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటో వాటికి పరిష్కారం ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ

గర్భధారణ సమయంలో స్త్రీలకు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మహిళల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అనేక సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

హార్మోన్ల అసమతుల్యత

మహిళల్లో పిసిఒఎస్ కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన జీవనశైలిని అనుసరించాలి. భోజనాల మధ్య సుదీర్ఘ విరామాలు ఉండకూడదు. శారీరక శ్రమ తక్కువగా చేయాలి. సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి.

యుటిఐ

యుటిఐ సమస్య వల్ల మహిళల్లో కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి. మగవారిలో కంటే ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చిందంటే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవడం మరిచిపోవద్దు. లేదంటే సమస్య మరింత జఠిలమవుతుందని గుర్తుంచుకోండి.

మధుమేహం

మధుమేహం కూడా మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీ దెబ్బతింటుంది. సమస్యను నివారించాలనుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories