వర్షాకాలంలో డెంగ్యూ, టైఫాయిడ్‌ ఎక్కువ.. నివారించాలంటే ఈ పనులు చేయండి..!

There is a Risk of Dangerous Diseases Like Dengue Typhoid in Rainy Season do These Simple Things to Avoid
x

వర్షాకాలంలో డెంగ్యూ, టైఫాయిడ్‌ ఎక్కువ.. నివారించాలంటే ఈ పనులు చేయండి..!

Highlights

Health Tips: వర్షాకాలం వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: వర్షాకాలం వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో కొంచెం అజాగ్రత్త ఉంటే డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సి ఉంటుంది. ఈ వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో రోగాలు రాకుండా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి పద్దతులు పాటించాలో తెలుసుకుందాం.

దోమలను నివారించండి

డెంగ్యూ, మలేరియాను నివారించడానికి దోమలను నివారించడం చాలా ముఖ్యం. అందువల్ల ఈ సీజన్‌లో ఉదయం లేదా సాయంత్రం ఫుల్ స్లీవ్‌లతో కూడిన దుస్తులను ధరించాలి. తద్వారా దోమలను నివారించవచ్చు. ఇది కాకుండా మీరు మోస్కాటో కాయిల్ వంటివి ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు.

వ్యాయామం

రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యకరమైన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాయామం కోసం రోజులో 30 నిమిషాలు కేటాయించాలి. ఇది మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో బయట నడకకు వెళ్లలేకపోతే ఇంట్లోనే కొంచెమైనా వ్యాయామం చేయాలి.

నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. డిప్రెషన్, మలబద్ధకం, అధిక రక్తపోటు తక్కువ నిద్రకి కారణం అవుతాయి. కాబట్టి ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాదు రోజు మొత్తం చురుకుగా ఉంటారు. దీని కారణంగా మీ జ్ఞాపకశక్తి కూడా పదునుగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories