Health Tips: శరీరంలో ప్రొటీన్‌ లేదంటే చాలా ప్రమాదం.. ఈ సమస్యలని నివారించలేరు..!

There is a lot of Danger if There is no Protein in the Body These Problems Cannot be Prevented
x

Health Tips: శరీరంలో ప్రొటీన్‌ లేదంటే చాలా ప్రమాదం.. ఈ సమస్యలని నివారించలేరు..!

Highlights

Health Tips: శరీరానికి చాలా పోషకాలు అవసరం. ఇందులో ఒక్కటి లోపించినా శరీరం సరిగా పనిచేయదు.

Health Tips: శరీరానికి చాలా పోషకాలు అవసరం. ఇందులో ఒక్కటి లోపించినా శరీరం సరిగా పనిచేయదు. ఈ పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలోని కండరాలు, చర్మం, ఎంజైమ్‌లు, హార్మోన్‌లకు బిల్డింగ్ బ్లాక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని కణాల నిర్మాణానికి, మరమ్మతులకు ప్రోటీన్ అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 బిలియన్ మంది ప్రజలు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని వెల్లడైంది. శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రొటీన్ లోపం వల్ల కలిగే నష్టాలు

1. శరీరంలో ప్రొటీన్ లోపం వల్ల ముఖం, చర్మం, పొట్ట వాపుల సమస్యలు ఎదురవుతాయి.

2. ప్రొటీన్ లోపం వల్ల కొత్త కణాల నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీని కారణంగా రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

3. ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాల నొప్పి ఏర్పడుతుంది.

4. ప్రోటీన్ లోపం పిల్లల ఎత్తు ఆగిపోతుంది.

5. ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురవుతారు.

6. ప్రొటీన్ లోపం మొదట జుట్టు మీద కనిపిస్తుంది. జుట్టు పొడిబారిపోయి, నిర్జీవంగా మారుతుంది.

7. శరీరంలో ప్రోటీన్, కాల్షియం లేకపోవడం వల్ల గోర్లు విరగడం మొదలవుతుంది.

8. ప్రొటీన్ లోపం వల్ల శరీరం అకస్మాత్తుగా లావుగా మారుతుంది.

9. శరీరంలో ప్రొటీన్ లేకపోవడం వల్ల అలసట వస్తుంది.

10. ప్రోటీన్ లోపం వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్ సమస్యలు ఎక్కువవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories