Super Foods: చలికాలంలో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువ.. ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోండి..!

There Are More Chances Of Breaking Bones In Winter Add These Super Foods In Your Diet
x

Super Foods: చలికాలంలో ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువ.. ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో చేర్చుకోండి..!

Highlights

Super Foods: చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గి, ఎముకలు బలహీనపడతాయి. ఇది ఫ్రాక్చర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Super Foods: చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గి, ఎముకలు బలహీనపడతాయి. ఇది ఫ్రాక్చర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం శీతాకాలంలో ఫ్రాక్చర్ ప్రమాదం 20% అధికంగా ఉంటుంది. వేసవిలో కంటే శీతాకాలంలో ఎముకలు తొందరగా విరుగుతాయి. ఫ్రాక్చర్ తీవ్రమైన సమస్య ఇది నొప్పి, వైకల్యం, మరణానికి కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో ఎముకలు దృఢంగా ఉండేందుకు కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పాలు, పెరుగు, చీజ్

పాలు, పెరుగు, జున్నులో కాల్షియం కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల నిర్మాణానికి, రిపేర్‌కు కాల్షియం అవసరం. ఒక కప్పు పాలలో 300 mg కాల్షియం, ఒక కప్పు పెరుగులో 400 mg కాల్షియం, ఒక కప్పు చీజ్‌లో 700 mg కాల్షియం ఉంటుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

బచ్చలికూర, బ్రోకలీ వంటి పచ్చని ఆకు కూరల్లో కాల్షియం, విటమిన్ కె, ఇతర పోషకాలు ఉంటాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బచ్చలికూరలో 250 mg కాల్షియంర, ఒక కప్పు బ్రోకలీలో 100 mg కాల్షియం లభిస్తుంది.

సాల్మన్, ట్యూనా చేపలు

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఒక కప్పు సాల్మన్ చేపల్లో1,500 mg ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఒక కప్పు ట్యూనాలో 400 mg ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి.

గింజలు

బాదం, వాల్‌నట్‌లు, నువ్వులు వంటి గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఒక కప్పు బాదంపప్పులో దాదాపు 250 మి.గ్రా కాల్షియం, ఒక కప్పు వాల్ నట్స్ లో 100 మి.గ్రా కాల్షియం ఉంటుంది.

సోయా ఉత్పత్తులు

టోఫు, సోయా పాలు వంటి సోయా ఉత్పత్తులు కాల్షియంకి మంచి వనరులు. ఒక కప్పు సోయా పాలలో 300 mg కాల్షియం, ఒక కప్పు టోఫులో 400 mg కాల్షియం ఉంటుంది.

చిక్కుళ్లు

బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు వంటి చిక్కుళ్లు కాల్షియం, ఐరన్, ఇతర పోషకాలకు మంచి వనరులు. ఒక కప్పు బీన్స్‌లో 100 mg కాల్షియం, ఒక కప్పు పప్పులో 200 mg కాల్షియం ఉంటుంది.

గుడ్లు

గుడ్లు విటమిన్ డికి మంచి మూలం. విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఒక గుడ్డులో 40 IU విటమిన్ డి లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories