Makhana: పరగడుపున మఖానా తింటే బోలెడు ప్రయోజనాలు.. బరువు తగ్గేవారికి ఉత్తమ ఎంపిక

There are Many Health Benefits to Taking Makhana on an Empty Stomach
x

Makhana: పరగడుపున మఖానా తింటే బోలెడు ప్రయోజనాలు.. బరువు తగ్గేవారికి ఉత్తమ ఎంపిక

Highlights

Makhana: బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు, ఉపవాసం ఉండేవారికి మఖానా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

Makhana: బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు, ఉపవాసం ఉండేవారికి మఖానా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని స్నాక్స్‌గా తీసుకుంటారు. మఖానాలో పోషకాలు విరివిగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, క్యాల్షియం, ప్రొటీన్లు శరీరానికి చాలా ముఖ్యమైనవి. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు శరీరానికి దూరంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో మఖానా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మఖానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది జీర్ణక్రియ ప్రక్రియని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలను నివారిస్తుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి మఖానా మంచి ఎంపిక అవుతుంది. పరగడుపున మఖానా తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కావాలంటే అల్పాహారంలో పాలతో కూడా మఖానా తీసుకోవడం ప్రారంభించవచ్చు. మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది కాకుండా మెగ్నీషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిదే.

ఖాళీ కడుపుతో మఖానా తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యని నివారించవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ కరోనా కాలంలో రోగనిరోధక శక్తి అందరికి అత్యంత అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం అల్పాహారంలో పాలు, ఓట్స్ లేదా సలాడ్‌లో మఖానా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. మఖానా అధికంగా పైబర్ ఉండటం వల్ల కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోరు. తద్వారా బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories