Rose Oil: రోజ్‌వాటర్‌ మాత్రమే కాదు రోజ్‌ ఆయిల్‌ కూడా ఔషధమే.. లెక్కలేనన్ని ప్రయోజనాలు..!

The Wonderful Medicinal Properties of Rose Oil are a Great Solution to these Health Problems
x

Rose Oil: రోజ్‌వాటర్‌ మాత్రమే కాదు రోజ్‌ ఆయిల్‌ కూడా ఔషధమే.. లెక్కలేనన్ని ప్రయోజనాలు..!

Highlights

Rose Oil: చాలామందికి రోజు వాటర్‌ గురించి తెలుసు కానీ రోజ్‌ ఆయిల్‌ గురించి తక్కువ మందికి తెలుసు. రోజువాటర్‌ని మెరుగైన అందంకోసం ఉపయోగిస్తారు.

Rose Oil: చాలామందికి రోజు వాటర్‌ గురించి తెలుసు కానీ రోజ్‌ ఆయిల్‌ గురించి తక్కువ మందికి తెలుసు. రోజువాటర్‌ని మెరుగైన అందంకోసం ఉపయోగిస్తారు. అయితే రోజ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటిసెప్టిక్, యాంటిస్పాస్మోడిక్, యాంటిడిప్రెసెంట్, యాంటీఫ్లాజిస్టిక్, యాంటీవైరల్ వంటి గుణాలు ఉంటాయి. ఇది శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

రోజ్ ఆయిల్ ప్రయోజనాలు

రోజ్ ఆయిల్ సహాయంతో శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడికి లోనైనట్లయితే రోజ్‌ ఆయిల్‌ ఉపయోగించి మెంటల్‌ కండీషన్‌ని బాగుచేసుకోవచ్చు. గాయాలు నయం చేయడం సులభం అవుతుంది. అనేక పరిశోధనల ప్రకారం ఇది స్త్రీలు, పురుషులలో లైంగిక కోరికను రేకెత్తిస్తుంది. రోజ్‌ ఆయిల్‌లో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇది క్రిముల నుంచి మనల్ని కాపాడుతుంది.

రోజ్‌ ఆయిల్‌ ఎలా ఉపయోగించాలి..?

రోజ్ ఆయిల్ సాధారణంగా చాలా ఖరీదైనది. కానీ అత్యంత ప్రభావవంతమైనది. దీని వాసన చూసినా లేదా చర్మానికి అప్లై చేసినా అది పలచగా ఉండాలి. దీన్ని ఉపయోగించే పద్ధతుల గురించి తెలుసుకుందాం.

రోజ్ ఆయిల్ బాత్

రోజ్ ఆయిల్ బాత్ కోసం క్యారియర్ ఆయిల్‌లో 10 చుక్కల రోజ్ ఆయిల్ మిక్స్ చేసి ఆపై వేడి బాత్ టబ్‌లో వేసి స్నానం చేస్తే చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఫుట్ బాత్

ఒక చిన్న టబ్‌లో కొన్ని చుక్కల పలచబరిచిన రోజ్ ఆయిల్ మిక్స్ చేసి అందులో పాదాలను 10 నిమిషాలు నానబెట్టాలి. చాలా రిలాక్స్‌గా ఫీలవుతారు.

రోజ్ ఆయిల్ మసాజ్

రోజ్ ఆయిల్‌తో శరీరాన్ని మసాజ్ చేయడం వల్ల శరీరం చాలా రిలాక్స్‌గా ఉంటుంది. అనేక రకాల నొప్పులు మాయమవుతాయి. గులాబీ నూనె వాసన చూడటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories