Health News: కర్పూరంతో ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించుకోండి..!

The Wonderful Medicinal Properties of Camphor Great Solution to these Health Problems | Camphor Uses
x

Health News: కర్పూరంతో ఈ ఆరోగ్య సమస్యలు తగ్గించుకోండి..!

Highlights

Health News: కర్పూరం(Camphor) వల్ల కలిగే ప్రయోజనాల గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం...

Health News: కర్పూరం(Camphor) వల్ల కలిగే ప్రయోజనాల గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కర్పూరం యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కర్పూరాన్ని పేస్ట్ చేయడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. మీరు నొప్పి, మంట, దురద నుంచి ఉపశమనానికి దీనిని వాడవచ్చు. అంతే కాకుండా కర్పూరం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మీకు శరీరంపై దురద సమస్యలు ఉంటే కర్పూరాన్ని గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. దీనిని పుదీన నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు దురద ఉన్నచోట రాయాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా దురద ఏర్పడుతుంది. ఈ సందర్భంలో కర్పూరం పేస్ట్ చర్మ సమస్యను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల లేదా జిడ్డు చర్మం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితుల్లో మొటిమలు వేగంగా పెరుగుతాయి.

వీటిని నియంత్రించడానికి మీరు కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. కర్పూరం, నిమ్మకాయ(Lemon) పేస్ట్‌తో మొటిమలు తొలగించవచ్చు. నిమ్మకాయ ముఖం లోపలి భాగాన్ని శుభ్రపరుస్తుంది. జిడ్డు సమస్యని తొలగిస్తుంది. కాలిన గాయాలకి కర్పూరం పేస్ట్ అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఇది వాటిని నయం చేస్తుంది. దీని కోసం కర్పూరాన్ని మెత్తగా రుబ్బి అందులో తేనె కలపాలి. దీన్ని గాయంపై పూయాలి. మొదట ఇది మీ చికాకును తగ్గిస్తుంది తర్వాత నెమ్మదిగా గాయాన్ని నయం చేస్తుంది.

మీ చర్మాన్ని ప్రశాంతంగా, తేమగా ఉంచడంలో కర్పూరం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు పగిలిన మడమల చికిత్సలో కూడా కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. మడమలు పగుళ్లు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జరుగుతుంది. ఈ పరిస్థితిలో చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం. అప్పుడు కర్పూరం కూడా ఉపయోగించవచ్చు. దీనిని వాడితే వెంటనే పగుళ్లు నయమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories