Health Tips: చలికాలంలో ఈ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.. జాగ్రత్త..!

The Risk of These Problems Increases in the Winter Season Neglect Takes a toll on Health
x

Health Tips: చలికాలంలో ఈ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.. జాగ్రత్త..!

Highlights

Health Tips: చలికాలం మొదలైంది.. ఈ సీజన్‌లో జనాలు ఎక్కువగా రోగాలబారిన పడుతారు.

Health Tips: చలికాలం మొదలైంది.. ఈ సీజన్‌లో జనాలు ఎక్కువగా రోగాలబారిన పడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఈ పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

చర్మ సమస్యలు

చలికాలంలో చర్మ సమస్యలు రావడం సర్వసాధారణం. ఎందుకంటే ఈ సీజన్‌లో చర్మం పొడిబారుతుంది. దద్దుర్లు, ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి. అందువల్ల ఈ సీజన్‌లో ఎక్కువగా నీరు తాగాలి. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి.

కీళ్ల నొప్పులు

చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే చల్లటి గాలి ప్రభావం వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ సమయంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పరిస్థితిలో శరీరాన్ని వెచ్చని దుస్తులతో కప్పుకోవాలి. వ్యాయామం చేయడం అస్సలు మర్చిపోవద్దు.

జలుబు, దగ్గు

చలికాలంలో చాలామంది జలుబు, దగ్గుకి గురవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వాతావరణం మారుతున్న కొద్దీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా ప్రజలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు.

గొంతు సమస్య

చలికాలంలో గొంతు సమస్యలు సర్వసాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతులో వాపు ఉంటుంది. దీంతో గొంతులో నొప్పి ఏర్పడుతుంది.

చలికాలంలో జాగ్రత్తలు

1. చల్లని రోజుల్లో పరిశుభ్రత గురించి కచ్చితంగా ఆలోచించాలి.

2. రోజూ స్నానం చేసి ఏదైనా తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

3. సీజనల్ పండ్లు, కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories