Health Tips: 40 ఏళ్ల తర్వాత గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.. ఈ సూపర్‌ డైట్‌ మెయింటెన్ చేయండి..!

The Risk of Heart Disease is High After 40 Years Maintain This Diet From Now
x

Health Tips: 40 ఏళ్ల తర్వాత గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ.. ఈ సూపర్‌ డైట్‌ మెయింటెన్ చేయండి..!

Highlights

Health Tips: వయసుతో పాటు శరీరంలోని అవయవాలు కూడా నెమ్మదిస్తాయి.

Health Tips: వయసుతో పాటు శరీరంలోని అవయవాలు కూడా నెమ్మదిస్తాయి. దీంతో వృద్ధాప్యం ముంచుకొస్తుంది. అయితే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. పోషక విలువలు కలిగిన ఆహారాలు శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. అందుకే 40 ఏళ్ల తర్వాత సూపర్‌ డైట్‌ మెయింటెన్ చేయాలి. ఇందులో కొన్ని ఆహారాలు తప్పనిసరిగా ఉండాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. తృణధాన్యాలు

సూపర్‌డైట్‌లో భాగంగా తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి మన శరీరానికి ముఖ్యంగా గుండెకు చాలా మేలు చేస్తాయి. శుద్ధి చేసిన ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ తృణధాన్యాలు మాత్రం గుండెను రక్షిస్తాయి.

2. డార్క్ చాక్లెట్

మీకు చాక్లెట్లు తినే అలవాటు ఉంటే ఇప్పటి నుంచే డార్క్‌ చాక్లెట్‌ తినడ అలవాటు చేసుకోండి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరిచే ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది.

3. కొవ్వు చేపలు

సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప వనరులు. శరీరానికి ప్రోటీన్ అవసరం. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన విటమిన్లను గ్రహించడంలో సహాయపడతాయి.

4. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర వంట నూనెలు కొరోనరీ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ ఆలివ్ నూనె దానిని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో ఆలివ్ నూనెను ఉపయోగిస్తే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories