Heart Attack Reasons: యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.. వైద్యులు ఇవే కారణాలుగా చెబుతున్నారు..!

The Risk Of Heart Attack Is Increasing Among The Youth.Doctors Say These Are The Reasons
x

Heart Attack Reasons: యువతలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.. వైద్యులు ఇవే కారణాలుగా చెబుతున్నారు..!

Highlights

Heart Attack Reasons: నేటి రోజుల్లో యువత ఎక్కువగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. దీనికి చాలా కారణాలు ఉంటున్నాయి.

Heart Attack Reasons: నేటి రోజుల్లో యువత ఎక్కువగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. దీనికి చాలా కారణాలు ఉంటున్నాయి. వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారంటే గుండెపోటు అనేది వృద్ధులకు మాత్రమే వస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ అది అతిపెద్ద అపోహ. దీనికి వయసుతో సంబంధం ఉండదు. జీవనశైలి ఎంపికలు, జన్యుశాస్త్రం గుండె ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాగే కొన్ని తెలియని అంశాలు కూడా చిన్న వయస్సులోనే గుండెపోటుకు దారితీస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కుటుంబ చరిత్ర

చిన్న వయస్సులోనే గుండె సమస్యలు ఎదురయ్యాయంటే ఒక్కసారి మీ కుటుంబ హిస్టరీని చెక్‌ చేయాలి. ఇందులో ఎవరికైనా గుండె జబ్బులు వచ్చినట్లు తేలితే మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి. తరచూ గుండెకి సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.

దాచిన వ్యాధులు

మధుమేహం, హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి కొన్ని వ్యాధులు ఉన్నవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరు సరైన జీవనశైలిని మెయింటెన్‌ చేయకపోతే ఎప్పుడు అటాక్‌చేస్తుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. వీరు కూడా డాక్టర్‌ పర్యవేక్షణలో తరచుగా టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.

టెన్షన్‌, జీవనశైలి

అధిక టెన్షన్‌, సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం యువతలో గుండెపోటుకు కారణాలు అవుతున్నాయి. ఈ అలవాట్లను ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. లేదంటే భవిష్యత్‌లో చాలా వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలియని లక్షణాలు

గుండె సమస్యల లక్షణాలు యువతలో వేరుగా ఉంటాయి. వీటిని వారు పట్టించుకోరు. ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, అలసట, వంటి సూక్ష్మ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories