Heart Attack: చిన్నపిల్లల్లో గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

The Risk of Heart Attack in Young Children is Increasing Rapidly These are the Reasons
x

Heart Attack: చిన్నపిల్లల్లో గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

Highlights

Heart Attack: ఈ రోజుల్లో చిన్నిపిల్లలు కూడా గుండెపోటుకి గురవుతున్నారు.

Heart Attack: ఈ రోజుల్లో చిన్నిపిల్లలు కూడా గుండెపోటుకి గురవుతున్నారు. ఈ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణం అనేకం ఉన్నాయి. ముఖ్యంగా వారు తినే ఆహారం కారణాంగానే ఈ సమస్య ఎదురవుతోంది. వేయించిన ఆహారాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ వంటి ఆహారాల వల్ల చాలామంది ఊబకాయం బారిని పడుతున్నారు. దీంతో శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోయి చిన్న వయసులోనే గుండె సమస్యలకి గురవుతున్నారు.

ఇటీవల కొంతమంది వైద్య నిపుణులు ఒక సర్వే నిర్వహించారు. గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 13 నుంచి 18 ఏళ్లలోపు 937 మంది పిల్లలపై ఈ సర్వే నిర్వహించారు. బాల్యం నుంచి కౌమారదశకు వెళ్లే ఈ చిన్నారుల ఆహారంలో సోడియం, కొవ్వు, షుగర్‌ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పీచుపదార్థాలతో కూడిన ఆహారం స్వల్పంగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

ఇందులో 26 శాతం మంది పిల్లలు అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాన్ని తిన్నారు. నూనెలో వేయించిన ఆహారాన్ని తినే పిల్లలు 30 శాతం మంది ఉన్నారు. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 3.4% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 2015 సర్వేలో ఇది కేవలం 2 శాతం మాత్రమే ఉండేది. UNICEF వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2022 అంచనా ప్రకారం 2030 నాటికి భారతదేశంలో 27 మిలియన్ల మంది పిల్లలు ఊబకాయంతో ఉంటారు.

ప్రపంచంలోని ప్రతి 10 మంది పిల్లలలో ఒకరు ఊబకాయంతో బాధపడుతారు. స్థూలకాయం విషయంలో భారత్ ఇప్పటికే ఐదో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు మధుమేహం, గుండె జబ్బులు పెరుగుతున్న వ్యక్తుల వయస్సుతో ముడిపడి ఉండేది. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఇప్పుడు చిన్న పిల్లలు కూడా షుగర్, హార్ట్ పేషెంట్లుగా మారుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories