Health Tips: వెన్నునొప్పికి అసలు కారణం ఇదే.. ఎలా నయం చేయాలంటే..?

The Real Cause of Back Pain is B12 Deficiency
x

Health Tips: వెన్నునొప్పికి అసలు కారణం ఇదే.. ఎలా నయం చేయాలంటే..?

Highlights

Health Tips: ఈ రోజుల్లో వెన్నునొప్పి సమస్య సర్వసాధారణం.

Health Tips: ఈ రోజుల్లో వెన్నునొప్పి సమస్య సర్వసాధారణం. ఆఫీసులో లేదా ఇంట్లో అతిగా పని చేయడం వల్ల నడుముపై ప్రభావం పడుతుంది. అయితే కేవలం అలసట, అధిక పని వల్ల మాత్రమే వెన్నునొప్పి వస్తుందంటే పొరపాటు మాత్రమే. ఇది శరీరంలోని కొన్ని పోషకాల లోపం వల్ల కూడా ఏర్పడుతుంది. మీరు వెన్నునొప్పిని వదిలించుకోవాలనుకుంటే నొప్పి వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ఏ పోషకాల లోపం వల్ల వెన్నునొప్పి వస్తుంది దానిని ఎలా తొలగించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

విటమిన్ B12 లోపం

వెన్ను నొప్పికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ బి12 లోపం. దీని పని రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడం. ఇది శరీరంలో శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి లోపిస్తే అలసట, వెన్నునొప్పి మొదలవుతుంది.

విటమిన్ డి లోపం

ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే కాల్షియం శోషణ సాధ్యం కాదు. వెన్నునొప్పి సమస్య ఏర్పడుతుంది. వెన్నునొప్పి వచ్చిందంటే అది విటమిన్ డి, కాల్షియం లేకపోవడం జరుగుతుందని గుర్తుంచుకోండి.

వెన్నునొప్పి నయం కావాలంటే..

వెన్నునొప్పి నయం కావాలంటే విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి ఎండలో కూర్చోవాలి. కాల్షియం లోపాన్ని తొలగించడానికి పెరుగు, పనీర్, వెన్న వంటి పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తీసుకోవాలి. విటమిన్ B12 లోపాన్ని తీర్చడానికి పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటిని డైట్‌లో చేర్చుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories