Blood Clots Problem: చలికాలంలో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువ.. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించండి..!

The Problem Of Blood Clots Is More In Winter If These Symptoms Appear Consult A Doctor
x

Blood Clots Problem: చలికాలంలో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువ.. ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించండి..!

Highlights

Blood Clots Problem: చలికాలంలో బాడీలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి. వీటితో పాటు సీజనల్‌ వ్యాధుల బెడద ఉంటూనే ఉంటుంది.

Blood Clots Problem: చలికాలంలో బాడీలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి. వీటితో పాటు సీజనల్‌ వ్యాధుల బెడద ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తాయి. ఈ రెండు వ్యాధుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ఇటీవల్ ఓ సర్వేలో తేలింది. అయితే రక్తం ఎందుకు గడ్డకడుతుందో, దానిని ఎలా నివారించాలో ఈ రోజు తెలుసుకుందాం.

యాక్టివ్‌గా ఉండరు

చల్లటి ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా ఈ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండరు. ఇది శారీరక శ్రమ స్థాయిని తగ్గిస్తుంది. దీని వల్ల శరీరం చురుకుగా ఉండదు. తక్కువ శారీరక శ్రమ ఊబకాయం, అధిక బీపీ వంటి పరిస్థితులను పెంచుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

డీ హైడ్రేషన్‌

చల్లటి వాతావరణంలో దాహం తక్కువగా ఉంటుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల చాలామంది డీ హైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల రక్తం గడ్డలు ఏర్పడతాయి. చలికాలంలో ప్రజలకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. శరీరంలో వాపునకు దారితీస్తుంది. దీని వల్ల పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, అధిక బీపీ, కొలెస్ట్రాల్ పెరగడం గుండె జబ్బులకు ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎలా రక్షించాలి..?

చలికాలంలో ప్రతి వ్యక్తి వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు కనీసం ఏడు గ్లాసుల నీరు తాగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఛాతీ లేదా తలలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవి గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అయ్యే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories