Health Tips: ఈ ఐదు ఆకుల రసాలు చెడు కొవ్వుకు శత్రువులు.. పరగడుపున తీసుకుంటే అద్భుత ఫలితాలు..!

The Juice Of These Five Leaves Dissolve Bad Fat With Amazing Results If Taken On An Empty Stomach
x

Health Tips: ఈ ఐదు ఆకుల రసాలు చెడు కొవ్వుకు శత్రువులు.. పరగడుపున తీసుకుంటే అద్భుత ఫలితాలు..!

Highlights

Health Tips: నేటి ఆధునిక కాలంలో జీవన విధానం మారడం వల్ల చాలామంది కొత్త కొత్త వ్యాధులకు గురవుతున్నారు. శ్రమ తక్కువగా ఉండే ఉద్యోగాలు చేయడం వల్ల బాడీలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.

Health Tips: నేటి ఆధునిక కాలంలో జీవన విధానం మారడం వల్ల చాలామంది కొత్త కొత్త వ్యాధులకు గురవుతున్నారు. శ్రమ తక్కువగా ఉండే ఉద్యోగాలు చేయడం వల్ల బాడీలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో చిన్నవయసులోనే గుండెపోటు వంటి వ్యాధులకు గురై చనిపోతున్నారు. నిజానికి కొలెస్ట్రాల్ కణాలు, హార్మోన్ల తయారీకి పనిచేస్తుంది. కానీ శరీరంలో దాని స్థాయి పెరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మందుల ద్వారా దీనిని కంట్రోల్‌ చేయవచ్చు కానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే సహజసిద్దమైన పద్దతుల ద్వారా కొవ్వును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కరివేపాకు ఆకుల రసం

ప్రతిరోజు పరగడుపున కరివేపాకు రసం తాగితే కొవ్వు సులువుగా కరుగుతుంది. ఒకవేళ జ్యూస్‌ తాగడం ఇష్టం లేకపోతే 8 నుంచి 10 ఆకులను వంటలో ఉపయోగించవచ్చు. జ్యూస్‌ విషయంలో కచ్చితంగా ఆయుర్వేద డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

కొత్తిమీర ఆకుల రసం

ప్రతి ఇంట్లో కొత్తిమీర లేనిదే కూర వండడం ముగియదు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చి తాగవచ్చు లేదా చట్నీ తయారు చేసి తినవచ్చు.

నేరేడు ఆకులు

కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి నేరేడు చెట్టు ఆకులు బాగా పనిచేస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్, ఆంథోసైనిన్ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది సిరల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పనిచేస్తుంది. నేరేడు ఆకులను పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు రెండు సార్లు తాగవచ్చు.

మెంతి ఆకులు

మెంతి ఆకులలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణీకరించడానికి మెంతి ఆకులను ప్రతిరోజు తినవచ్చు. మీరు సాధారణగా మెంతి ఆకులతో కూర వండుకొని తినవచ్చు.

తులసి ఆకులు

తులసి ఆకులలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే లక్షణాలు జీవక్రియ ఒత్తిడిని తగ్గించడానికి పని చేస్తాయి. ఇవి శరీర బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ప్రతిరోజూ పరగడుపున తులసి ఆకులను తీసుకోవచ్చు. ఇందుకోసం మొదట 5-6 ఆకులను బాగా కడిగి పొడిగా చేసుకొని నోట్లో వేసుకొని నమలాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories