ఈ సీజ‌న‌ల్ ఫ్రూట్ తింటే స‌ర్వ రోగాలు మ‌టుమాయం..

The Health Benefits of Custard Apple are Very Good
x

సీతాఫలం (ఫైల్ ఇమేజ్)

Highlights

Custard Apple: శీతాకాలంలో ల‌భించే సీజ‌న‌ల్ ఫ్రూట్ సీతాఫ‌లం.

Custard Apple: శీతాకాలంలో ల‌భించే సీజ‌న‌ల్ ఫ్రూట్ సీతాఫ‌లం. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ పండ్ల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి. దీనివ‌ల్ల శ‌రీరానికి చాలా పోష‌కాలు అందుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇందులో పొటాషియం , మెగ్నీషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. సీతాఫలంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది మన చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ పండు కళ్లకు కూడా మంచిదని భావిస్తారు. అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. అందుకే ఈ పండును ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. ఇందులో ఉండే రాగి మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది. విరేచనాల చికిత్సలో కూడా తోడ్ప‌డుతుంది. మీరు ఎక్కువగా అలసిపోవడం, బలహీనంగా అనిపిస్తే ఈ పండును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇందులో ఉండే పొటాషియం కండరాల బలహీనతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఇది రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సీతాఫలంలో సహజ చక్కెర ఉంటుంది.

మీరు పోషకమైన స్నాక్స్ , తీపి వంటకాలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.ఈ పండులో విటమిన్ బి 6 ఉంటుంది. డోపామైన్‌తో సహా న్యూరోట్రాన్స్‌మిటర్ల తయారీలో ఈ పోషకం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాన్ని తగినంత మొత్తంలో తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సీతాఫలంలో కాటెచిన్స్, ఎపికాటెచిన్స్ , ఎపిగాల్లోకాటెచిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. వీటిలో కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సీతాఫలం శరీరంలో మంటను త‌గ్గిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories