Health Tips: పగటిపూట నిద్రపోతున్నారా.. ఫలితం అనుభవిస్తారు జాగ్రత్త..!

The Habit of Sleeping During the Day is not Good for Health Know These Things for Sure
x

Health Tips: పగటిపూట నిద్రపోతున్నారా.. ఫలితం అనుభవిస్తారు జాగ్రత్త..!

Highlights

Health Tips: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నిద్ర చాలా ముఖ్యం.

Health Tips: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నిద్ర చాలా ముఖ్యం. ఒక వ్యక్తి కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరు తక్కువ నిద్రను తీసుకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. శరీర పనితీరులలో అనేక సమస్యలు ఏర్పడుతాయి. చాలా సార్లు రాత్రిపూట నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల దానిని కవర్‌ చేయడానికి పగటిపూట కునుకు తీస్తాం. కానీ ఇది సరికాదు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈరోజు తెలుసుకుందాం.

పగటిపూట ఎందుకు నిద్రపోకూడదు

ఆయుర్వేద పద్ధతి ప్రకారం పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కొంతమంది అలసటతో లేదా ఇతర కారణాల వల్ల పగటిపూట గాడనిద్రపోతారు. దీనివల్ల శరీరంలో దగ్గు పెరుగుతుందని పరిశోధనలో రుజువైంది. 10 నుంచి 15 నిమిషాల నిద్ర పర్వాలేదు. కానీ గాఢ నిద్రపోతే చాలా చెడు ప్రభావం ఉంటుంది.

ఈ వ్యక్తులు పగటిపూట నిద్రపోకూడదు..

మీరు ఫిట్‌గా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలనుకుంటే పగటిపూట నిద్రపోవద్దు. పొట్ట, నడుము కొవ్వు తగ్గించుకోవాలని ఆలోచించే వారు రాత్రిపూట మాత్రమే నిద్రపోవాలి. అధికంగా నూనె, వేయించిన ఆహారం లేదా మెత్తటి పిండితో చేసిన పదార్థాలు తినే వ్యక్తులు పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి. మధుమేహం, హైపోథైరాయిడ్, పిసిఒఎస్ వ్యాధితో బాధపడేవారు కూడా పగటిపూట నిద్రపోకూడదు.

ఎవరు నిద్రపోవచ్చు

ప్రయాణాల వల్ల విపరీతంగా అలసిపోయేవారు పగటిపూట నిద్రపోవడం మంచిది. బాగా సన్నగా, బలహీనంగా ఉన్నవారు నిద్రపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం లేదా శస్త్రచికిత్స తర్వాత డాక్టర్ మిమ్మల్ని పగటిపూట విశ్రాంతి తీసుకోవాలని కోరితే ఖచ్చితంగా అనుసరించండి. చైల్డ్ డెలివరీ మహిళలకు కూడా విశ్రాంతి అవసరం వారు పగటిపూట నిద్రపోవాలి. 10 ఏళ్లలోపు, 70 ఏళ్లు పైబడిన వారు పగటిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories