Health News: అర్ధరాత్రి ఆహారం తింటున్నారా.. వ్యాధులని ఆహ్వానించినట్లే..!

The Habit of Eating Late at Night can make you sick | Health Care Tips
x

Health News: అర్ధరాత్రి ఆహారం తింటున్నారా.. వ్యాధులని ఆహ్వానించినట్లే..!

Highlights

Health News: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి...

Health News: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పెద్ద నగరాల్లో ప్రజలు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తారు. దీని కారణంగా వారు అర్థరాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. దీంతో పాటు అర్థరాత్రి ఆహారం తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంటారు. చాలా సార్లు ప్రజలు లేట్ నైట్ కోరికలను తీర్చుకోవడానికి హోటల్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు. దీని వల్ల చాలా సార్లు శరీరం నష్టపోతుంది. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరుగుతాయి. దీని వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.

ఈ ఇబ్బందులకు కారణం అర్థరాత్రి భోజనం కావచ్చు

అర్థరాత్రి ఆహారం తినడం వల్ల ఎసిడిటీ(Acidity) సమస్యకు దారితీస్తుంది. దీంతో పాటు కొన్నిసార్లు ఇది ఛాతీలో మంటను కలిగిస్తుంది. కాబట్టి ఆలస్యంగా ఆహారం తీసుకోవడం మానుకోండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం, గుండెల్లో మంట మొదలైన సమస్యలు ఉంటాయి. కాబట్టి అర్థరాత్రి పూట ఆహారం తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తుంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి. దీని వల్ల ఆహారం వీలైనంత త్వరగా జీర్ణమవుతుంది. రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల మధుమేహం(Diabetes), అధిక రక్తపోటు(High BP), బరువు పెరగడం(Weight Gain), డిప్రెషన్(Depression), ఒత్తిడి(Stress), నిద్ర సమస్యలు వస్తాయి.

ఈ సమయానికి భోజనం చేయడం మంచిది

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవాలి. అదే సమయంలో రాత్రి 10 గంటల తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి. చాలా మంది ఆరోగ్య నిపుణులు నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు రాత్రి భోజనం చేయాలని సూచిస్తున్నారు. దీని వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. గ్యాస్, అజీర్ణం మొదలైన సమస్యలు ఉండవు.

Show Full Article
Print Article
Next Story
More Stories