Punarnava Uses: వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే అద్భుతమైన మూలిక గలిజేరు మొక్క
Punarnava Uses: పొలం గట్ల వెంబడి దొరికే ఓ నేలబారు తీగ మొక్క ... వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే అద్భుతమైన మూలిక గలిజేరు మొక్క. పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరు, ఎర్రగలిజేరు అనీ పిలుస్తారు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. సంస్కృతంలో స్వనాడిక, రక్తపుష్ప, పునర్నవ అంటారు. ఇంక ఎలాంటి జబ్బులకు ఉపయోగపడుతుంది. మన హెచ్ ఎం టివి "లైఫ స్టైల్" లో తెలుసుకుందాం..
తెల్ల గలిజేరు ఉత్తమం...
తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు ఇంగ్లీష్ లో boerhavia diffusa అని పిలుస్తారు.
కిడ్నీ సమస్యలకు...
తెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి పది నిమిషాలుమరగనివ్వాలి. అనంతరం చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కానీ ప్రక్రియను 21 రోజులు చేయివలసి వుంటుంది. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు.
యాంటీఆక్సిడెంట్లు అధికం...
శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది.
ప్రతీదీ పనికి వస్తుంది...
పునర్నవలో ఆకు, కాండం, వేరు... ఇలా ప్రతీదీ పనికి వస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవల్స్ సరిచేయటానికి, వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని జ్వరాలకూ... ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది.
మూటకట్టుకుంటున్న బహుళజాతి కంపెనీలు...
మానవ శరీరంలో కీలకమైన భాగాలు నిత్య యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటే అనారోగ్యాలు మనదరికి రావు. మనం మరిచిపోయిన పునర్నవ్‌ని బహుళజాతి కంపెనీలు గుర్తుపెట్టుకున్నాయి. శుభ్రంగా ఎండబెట్టి, పొడి చేసి ఆకర్షణీయంగా డబ్బాల్లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నాయి.
శ్వాస సంబంధిత వాధులకు...
తెల్ల గలిజేరు వేడి చేసి, కఫము, దగ్గు, విషము, హృద్రోగాలను, పాండు రోగాలు, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది. బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి, పాండు రోగము, శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి, వాతము, కఫము, ఉబ్బు పోగొడుతుంది .శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .
పిత్తానికి చెక్ పెట్టే ఎర్ర గలిజేరు...
ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది. నల్ల గలిజేరు కారం, చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది. ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె. ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు, ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి లో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఆకుల తో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .
సర్వ జ్వరాల నివారణకు...
తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది. తెల్లగలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది.ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి. diabetes, అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి.
కుష్టు నివారణకు...
నెల రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది. ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి, కంటి చూపు మెరుగు పడుతుంది. ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. అలా మూడు రోజులు తినాలి.
మొక్కం పై మచ్చలు తగ్గిస్తుంది...
ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి, వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే తగ్గుతాయి. నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు. గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి. రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ, గుండె బలహీనత తగ్గుతాయంటారు.
వైద్యులను సంప్రదించి వాడుకోవాలి...ల
ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే వాడాలి. lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది . ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే 'పునర్నవ' అయ్యింది
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire