చికెన్, మొక్కజొన్న కాంబినేషన్లో అదిరే సూప్.. రుచి చూశారంటే వదలరు..?

Tasty Soup with Winter Special Chicken and Corn Combination | Winter Special Soups
x

చికెన్, మొక్కజొన్న కాంబినేషన్లో అదిరే సూప్.. రుచి చూశారంటే వదలరు..?

Highlights

Chicken Corn Soup: సాయంకాలం పూట చాలామంది వేడి వేడిగా వెరైటీగా ఏమైనా తినాలని కోరుకుంటారు...

Chicken Corn Soup: సాయంకాలం పూట చాలామంది వేడి వేడిగా వెరైటీగా ఏమైనా తినాలని కోరుకుంటారు. అలాంటి వారికి చికెన్ కార్న్ సూప్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. టేస్టీకి టేస్టి.. వెరైటీకి వెరైటీ.. అంతేకాదు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలైనవాటికి ఈ సూప్‌తో చెక్ పెట్టవచ్చు. అంతేకాదు ఈ సూప్ తయారుచేయడం కూడా చాలా సులువైన పని. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

చికెన్ సూప్‌కి కావలసిన పదార్థాలు మూడు కప్పుల చికెన్ స్టాక్, 250 గ్రాములు తురిమిన చికెన్, లిటిల్ స్వీట్ కార్న్, తరిగిన పచ్చి ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, ఒక టీస్పూన్ నూనె, మొక్కజొన్న పిండి, రుచికి సరిపడ ఉప్పు ఉంటే చాలు.

ఎలా తయారు చేయాలి..

స్టవ్‌పై ఒక గిన్నెపెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు అందులో స్వీట్ కార్న్ వేసి చికెన్ స్టాక్ కూడా వేయాలి. అలాగే అందులో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత కార్నర్‌ని మధ్యలో వేయాలి. దీనివల్ల సూప్ చిక్కగా ఉంటుంది. కొద్దిసేపు తర్వాత గుడ్డును కొట్టి అందులో వేసి బాగా కలపాలి. తక్కువ మంటపై బాగా మరిగించాలి. అంతే మీ సూప్ రెడీ ..

Show Full Article
Print Article
Next Story
More Stories