Sleep Tips : అర్థరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా..ఈ విటమిన్లు తీసుకుంటే నిమిషాల్లో నిద్ర రావడం ఖాయం

Sleep Tips : అర్థరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా..ఈ విటమిన్లు తీసుకుంటే నిమిషాల్లో నిద్ర రావడం ఖాయం
x

 Sleep Tips : అర్థరాత్రి దాటినా నిద్ర పట్టడం లేదా..ఈ విటమిన్లు తీసుకుంటే నిమిషాల్లో నిద్ర రావడం ఖాయం

Highlights

Sleep Tips : నిద్రలేమికి తరచుగా విటమిన్ డి లోపం కూడా ఒక కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటితో పాటు కొన్ని విటమిన్ లోపాలు మిమ్మల్ని నిద్రలేమి వంటి సమస్యలకు గురిచేస్తాయి.అలాంటి విటమిన్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

sleep tips : మన దైనందిన జీవితంలో నిద్ర అనేది అత్యంత ఆవశ్యకమైనది. నిద్ర లేకపోతే మన శరీరం అలసట వల్ల అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. నిద్రలోనే మన శరీరంలోని కణాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి.అందుకే నిద్ర లేమి ఉండే వ్యక్తులలో కణాలు దెబ్బతినేప్రమాదం ఉంటుంది.ఫలితంగా డయాబెటిస్,బ్లడ్ ప్రెషర్ వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది.నిద్రలేమికి తరచుగా విటమిన్ డి లోపం కూడా ఒక కారణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వీటితో పాటు కొన్ని విటమిన్ లోపాలు మిమ్మల్ని నిద్రలేమి వంటి సమస్యలకు గురిచేస్తాయి.అలాంటి విటమిన్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ప్రభావం:

మీరు రాత్రి తగినంత ప్రశాంతమైన నిద్రించకపోతే, మీకు ఉదయం అలసట, చిరాకు కలుగుతాయి. ఇది కాకుండా, నిద్రలేమి సమస్య కొనసాగితే, మీరు హై బీపీ,ఆల్జిమర్స్,మధుమేహం,ఊబకాయం,రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు వస్తాయి.నిద్రలేమి అనేది పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇందులో డిమెన్షియా అనే మెదడు జబ్బు కూడా ఉంది.అందుకే మీ దినచర్యలో నిద్రకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.మీ నిద్రను మెరుగుపరచడానికి ఏ పోషకాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ డి:

విటమిన్ డి సూర్యకాంతి నుంచి ప్రత్యక్షంగా లభించే విటమిన్.దీని లోపం కూడా నిద్ర నాణ్యతపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అయితే సూర్యకాంతి తోపాటు కోడిగుడ్లు,పెరుగు,చేపల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

కాల్షియం:

కాల్షియం లోపం కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది.మీ ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మీరు నిద్రలేమి నుంచి బయటపడవచ్చు.

విటమిన్ B12:

విటమిన్ B12 లోపం మీ నిద్రను ప్రభావితం చేస్తుంది.బి12 లేకపోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర కరువు అవుతుంది.విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మీరు నిద్రలేమి నుంచి బయటపడవచ్చు.కోడిగుడ్లు, ఆకుకూరలు,పాలు,పుట్టగొడుగుల్లో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ :

శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లేనట్లయితే, నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది.ఈ పోషకాలు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైతం సహాయపడతాయి.నిద్రలేమి నుంచి ఒత్తిడిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

మెగ్నీషియం :

మెగ్నీషియం ఆందోళన, ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తాయి.ఇది కాకుండా, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా నరాల, కండరాలను బలంగా ఉంచుతాయి.చిక్కుడు కాయలు, సోయా, అవకాడో పండ్లు,బంగాళదుంపలు వంటివి మెగ్నీషియం పొందడానికి మంచి మూలాలుగా చెప్పవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories