Health Tips: ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వీటిని తీసుకోండి.. శ్వాసలో ఎటువంటి ఇబ్బంది ఉండదు..!

Take These for Lung Health No Problem in Breathing
x

Health Tips: ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వీటిని తీసుకోండి.. శ్వాసలో ఎటువంటి ఇబ్బంది ఉండదు..!

Highlights

Health Tips: మంచి శ్వాస తీసుకోవాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి.

Health Tips: మంచి శ్వాస తీసుకోవాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి. ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి చాలామంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తులు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లయితే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా డైట్‌లో కొన్ని ఆహారాలని చేర్చుకోవాలి.

తిప్పతీగ (గిలోయ్)

తిప్పతీగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది అనేక వ్యాధులకి దివ్యఔషధమని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు ఊపిరితిత్తులను వైరల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజు తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు ఈ ఆకులతో కషాయాలని తయారుచేసి కూడా వాడవచ్చు.

పసుపు

వంటగదిలో ఉండే పసుపు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నయం చేస్తుంది. పసుపు అనేది యాంటీ-వైరల్ ఇది ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పసుపు పాలు తాగడం ప్రారంభించండి. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.

అల్లం

అల్లంలో ఆయుర్వేద గుణాలు అధికంగా ఉంటాయి. ఇది గొంతులో, ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అల్లాన్ని రోజు టీలో వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories