Health Tips: లిఫ్ట్‌కి బై బై చెప్పండి ప్రతిరోజు మెట్లు ఎక్కండి.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!

Take The Stairs Every Day And Say Bye Bye To The Elevator There Are Big Benefits
x

Health Tips: లిఫ్ట్‌కి బై బై చెప్పండి ప్రతిరోజు మెట్లు ఎక్కండి.. ఈ వ్యాధుల ప్రమాదం తక్కువ..!

Highlights

Health Tips: నేటి రోజుల్లో చాలామంది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ కాసేపు నడవడానికి బద్ధకంగా ఫీలవుతున్నారు. ప్రతిసారి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లపై ఆధారపడుతున్నారు.

Health Tips: నేటి రోజుల్లో చాలామంది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ కాసేపు నడవడానికి బద్ధకంగా ఫీలవుతున్నారు. ప్రతిసారి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లపై ఆధారపడుతున్నారు. దీనివల్ల చాలామంది ఊబకాయులుగా మారుతున్నారు. డయాబెటీస్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలా కాకుండా అప్పుడప్పుడు అవసరం వచ్చినప్పుడు మెట్లను ఉపయోగించాలి. షాపింగ్ మాల్స్ లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు లిఫ్ట్‌లు ఉపయోగించకుండా మెట్ల దారిన వెళ్లాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మెట్లు ఎక్కడం వల్ల గుండెకు మేలు

నేటి కాలంలో చాలామందిలో గుండె జబ్బులు పెరిగిపోయాయి. చెడు జీవనశైలి, గంటలు గంటలు కూర్చుని పని చేయడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో వారానికి ఒకసారి సైకిల్ తొక్కడం లేదా నడవడం వంటివి చేయాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెట్లు ఎక్కడం మంచి మార్గం. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కినప్పుడు శరీరం కష్టపడి పని చేస్తుంది. తక్కువ సమయంలో మంచి వ్యాయామం ఫలితాలను పొందవచ్చు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బయటికి వెళ్లి తిన్నప్పుడు తిరిగి వచ్చేటపుడు లిఫ్ట్‌ను నివారించండి. మెట్లను ఉపయోగించండి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడం సులభం అవుతుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి సురక్షితంగా ఉంటారు. మెట్లు ఎక్కడం వల్ల జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ఫిట్‌గా ఉండేందుకు సహాయపడుతుంది.

కండరాలకు ప్రయోజనాలు

ప్రతిరోజు మెట్లు ఎక్కడం వల్ల కండరాలకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.

స్టామినా పెరుగుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు కింది భాగంలోని హామ్ స్ట్రింగ్స్, గ్లుట్స్, క్వాడ్‌లు బలంగా బిగువుతుగా తయారవుతాయి. మెట్లు ఎక్కడం, దిగడం అనేది బరువును అదుపులో ఉంచుతుంది. అయితే ఇది మీరు మెట్లు ఎక్కే వేగం, ఎంత సమయం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు వ్యక్తి ఆరోగ్యం, వయస్సు, పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories