Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో ఉండాల్సిందే..!

Super Foods Must Be Included In Your Diet For Hair Growth
x

Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సూపర్‌ ఫుడ్స్‌ డైట్‌లో ఉండాల్సిందే..!

Highlights

Hair Growth Tips: ఆడవారికి జుట్టే అందం. జుట్టు ఎంత పొడవుగా ఉంటే వారి ఆరోగ్యం అంత బాగున్నట్లు.

Hair Growth Tips: ఆడవారికి జుట్టే అందం. జుట్టు ఎంత పొడవుగా ఉంటే వారి ఆరోగ్యం అంత బాగున్నట్లు. కానీ నేటికాలంలో చాలామంది మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నా రు. ముఖ్యంగా పెళ్లికాని యువతులు జట్టు పెరగడానికి మార్కెట్‌లో లభించే చాలా హెయిర్‌ ఆయిల్స్‌ వాడుతున్నారు. వీటివల్ల జుట్టు పెరగడం ఏమో గానీ ఉన్న జుట్టు ఊడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. జుట్టు పెరగాలంటే ట్యాబ్లెట్స్‌, ఆయిల్‌ వాడడం కాదు ముందుగా మీరు తినే ఆహారంలో మార్పులు చేయాలి. జుట్టు పెరగడానికి సాయపడే సూపర్‌ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బాదం

బాదంలో విటమిన్ ఈ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లి పోకుండా కాపాడుతుంది. జుట్టుకు ఆక్సిజన్, రక్తాన్ని సమృద్ధిగా అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. డాండ్రఫ్ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. జుట్టును పొడిబారకుండా చేస్తుంది.

గుడ్డు

గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ప్రోటీన్లు , ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు సాయపడుతాయి. ఇది జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడంలో సాయపడుతుంది.

చికెన్

జుట్టు పెరుగుదలకు చికెన్ సాయపడుతుంది. దీనిలో ఎల్-లైసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. లీన్ ప్రొటీన్, విటమిన్ B కూడా ఉంటుంది. ఇవి జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి. సాల్మన్ చేపలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి జుట్టు పెరిగేలా చేస్తాయి.

బీన్స్

చిక్కుళ్లు, బీన్స్ జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే ఫొలేట్, బి విటమిన్స్ జుట్టుని పొడుగ్గా చేస్తాయి. అలాగే ఆకుకూరలు జుట్టు పెరుగుదలకి చాలా ముఖ్యం. వీటిని ఎక్కువగా డైట్‌లో యాడ్ చేస్తే అందులో ఉండే ఫోలేట్ జుట్టుని బలంగా మార్చి జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. వారానికి రెండు మూడు సార్లైనా ఆకుకూరలు తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories