Summer Diet Plan: ఎండాకాలం ఈ డ్రై ఫ్రూట్స్‌ బెస్ట్‌.. ఈ రుగ్మతలు దరిచేరవు..!

Summer Has Come To Increase Immunity Include These Dry Fruits In Your Diet
x

Summer Diet Plan: ఎండాకాలం ఈ డ్రై ఫ్రూట్స్‌ బెస్ట్‌.. ఈ రుగ్మతలు దరిచేరవు..!

Highlights

Summer Diet Plan: వేసవికాలం వచ్చేసింది. డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. లేదంటే ఇమ్యూనిటీ పవర్‌ తగ్గి సీజనల్‌ వ్యాధులకు గురవుతాం.

Summer Diet Plan: వేసవికాలం వచ్చేసింది. డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. లేదంటే ఇమ్యూనిటీ పవర్‌ తగ్గి సీజనల్‌ వ్యాధులకు గురవుతాం. వేసవిలో ఐదు రకాల డ్రై ఫ్రూట్స్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులకు గురికాకుండా ఉంటాం. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

బాదం: బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధక పనితీరుకు సపోర్ట్‌ చేస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

వాల్‌నట్‌లు: వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి మూలం. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కణాల పెరుగుదల, రిపేర్‌కు అవసరమైన జింక్, రోగనిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడే విటమిన్ B6 ఉంటుంది.

ఎండుద్రాక్ష: ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటలో ఫైబర్‌ ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడి రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.

జీడిపప్పు: జీడిపప్పులో జింక్, విటమిన్ సి, కాపర్ ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కణాల పెరుగుదల, రిపేర్‌ కోసం జింక్ అవసరం. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఖర్జూరాలు: ఎండిన ఖర్జూరాలు పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. వాటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories