How To Store Eggs: గుడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఇలా స్టోర్‌ చేయండి..!

Store Eggs This Way To Keep Them From Spoiling For A Long Time
x

How To Store Eggs: గుడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే ఇలా స్టోర్‌ చేయండి..!

Highlights

How To Store Eggs: గుడ్లు సంతృప్తికరమైన ఆహారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్. ఎందుకంటే ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది.

How To Store Eggs: గుడ్లు సంతృప్తికరమైన ఆహారం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్. ఎందుకంటే ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా రోజుకొక గుడ్డు తీసుకోవాలి. చలికాలం రాగానే చాలామంది గుడ్లు తినడం మొదలుపెడతారు. అందుకే ఒక్కసారి డజన్ల చొప్పున గుడ్లని కొనుగోలు చేస్తారు. కానీ వీటిని ఎక్కువ రోజులు స్టోర్‌ చేయలేరు. ఎందుకంటే అవి తొందరగా పాడవుతాయి. ఇటువంటి పరిస్థితిలో ఎక్కువ కాలం గుడ్లను స్టోర్‌ చేయడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గుడ్లు ఎక్కువ కాలం స్టోర్‌ చేయాలంటే ముందుగా గుడ్డు చెడిపోయిందో లేదో చెక్ చేయాలి. ఇందుకోసం వాటిని ఒక గిన్నెలో నీళ్లుపోసి అందులో వేయండి. అది మునిగిపోతే చెడిపోయిందని అర్థం. అలా కాకుండా తేలడం ప్రారంభిస్తే గుడ్డు తాజాగా ఉందని అర్థం. ఇది కాకుండా గుడ్డును కదిలించడం ద్వారా కూడా చెక్‌ చేయవచ్చు. అది శబ్దం చేస్తే అది చెడిపోయింది స్టోర్‌ చేయడానికి పనికిరాదు. గుడ్లు స్టోర్ చేసేముందు ఈ పద్దతులు పాటించండి.

గుడ్లను రిఫ్రిజిరేటర్ మధ్య రాక్‌లో ఉంచండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు గుడ్లని ఫ్రిజ్‌ డోర్‌లో స్టోర్‌ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉంది. గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిపై మినరల్ ఆయిల్ రాసి ఎండలో కాసేపు ఉంచాలి. ఇప్పుడు వాటిని తిరిగి కార్టన్‌లో ప్యాక్ చేసి కిచెన్ రాక్‌లో స్టోర్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఒక నెల పాటు తాజాగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories