Banana Storage Tips: అరటిపండ్లు చాలా రోజులు తాజాగా ఉండాలంటే ఈ విధంగా స్టోర్‌ చేయండి..!

Store Bananas this way to keep them Fresh for Days
x

Banana Storage Tips: అరటిపండ్లు చాలా రోజులు తాజాగా ఉండాలంటే ఈ విధంగా స్టోర్‌ చేయండి..!

Highlights

Banana Storage Tips: అరటిపండును పేదవాడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ధరలో లభించే ఏకైక పండు.

Banana Storage Tips: అరటిపండును పేదవాడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే తక్కువ ధరలో లభించే ఏకైక పండు. పిల్లలున్న కుటుంబాలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కానీ సరిగ్గా స్టోర్‌ చేయకపోవడం వల్ల అవి తొందరగా పాడవుతాయి. నల్లగా మారి కుళ్లిపోతాయి. నిజానికి అరటిపండు ఇతర పండ్ల కంటే త్వరగా పక్వానికి వచ్చి నల్లగా మారుతుంది. ఇక ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే అరటిపండు చల్లటి గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల జలుబు, దగ్గ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఫ్రిజ్‌లో పెట్టకుండా అరటి పండ్లను ఎలా స్టోర్‌ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. కొమ్మను చుట్టండి

అరటిపండును చాలా రోజుల పాటు తాజాగా ఉంచడానికి దాని కొమ్మకు ప్లాస్టిక్ కవర్‌ లేదా టేప్‌ గట్టిగా చుట్టండి. దీనివల్ల అవి తొందరగా పక్వానికి రాకుండా ఉంటాయి.

2. హ్యాంగర్లు వాడండి

అరటిపండ్లు చెడిపోకుండా ఉండేందుకు మార్కెట్‌లో చాలా రకాల హ్యాంగర్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటికి అరటిపళ్ల గుత్తిని వేలాడదీస్తే చాలు. చాలా రోజులు తాజాగా ఉంటాయి. రుచిలో కూడా ఎలాంటి తేడా ఉండదు.

3. విటమిన్ సి టాబ్లెట్‌ ఉపయోగించండి

అరటిపండును చాలా రోజులు తాజాగా ఉంచాలంటే మార్కెట్ నుంచి విటమిన్ సి టాబ్లెట్‌ను కొనుగోలు చేసి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కరిగించాలి. ఈ నీటిని ఒక గిన్నెలో పోసి అందులో అరటిపండ్లను ఉంచాలి. దీనివల్ల పక్వానికి రాకుండా ఉంటాయి.

4. మైనపు కాగితంలో చుట్టండి

అరటిపండు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని మైనపు కాగితంలో చుట్టండి. దీనివల్ల అవి త్వరగా పాడవకుండా తాజాగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories