Stomach Cancer: ఈ ఆహారాలు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్‌..!

Stop Eating These Foods Otherwise you may get Stomach Cancer
x

Stomach Cancer: ఈ ఆహారాలు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్‌..!

Highlights

Stomach Cancer: ప్రస్తుతం యువతలో పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి.

Stomach Cancer: ప్రస్తుతం యువతలో పెద్దపేగు క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి అతి పెద్ద కారణం పేలవమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లే. వేయించిన ఆహారాలు తినడం వల్ల కడుపులో కణతిలు ఏర్పడుతున్నాయి. మీరు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే అలాంటి అలవాట్లను వదిలివేయడం మంచిది. కడుపు క్యాన్సర్‌కు కారణమయ్యే విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు

జీర్ణక్రియలో సమస్య ఉంటే అది పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు. ప్రేగు కదలిక సమయంలో రక్తం ఉంటే ఇది కూడా కడుపు క్యాన్సర్ లక్షణం అవుతుంది. కడుపులో మంట, నొప్పి కడుపు క్యాన్సర్‌కి సంకేతం అవుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే ఇది కడుపు క్యాన్సర్‌కి దారితీస్తుంది. బరువు కోల్పోయి తక్కువ ఆకలిగా ఉంటే కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

పెద్దప్రేగు క్యాన్సర్ కారణాలు

జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ సమస్యలు రావచ్చు. పేలవమైన ఆహారం పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణం అవుతుంది. మద్యపానం, ధూమపానం పెద్దప్రేగు క్యాన్సర్‌కు కారణమవుతుంది. మాంసాహారం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం క్యాన్సర్‌కు కారణమవుతుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

పిండితో కూడిన పదార్థాలు కడుపుకు చాలా హానికరం. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే కడుపు క్యాన్సర్ బారిన పడవచ్చు. మార్కెట్ సమోసాలు, పిజ్జా, బర్గర్ వంటి ఫాస్ట్ ఫుడ్ వంటి వేయించినవి క్యాన్సర్‌కు కారణమవుతాయి. అధిక పిండి పదార్ధాలు క్యాన్సర్‌కు కారణం అవుతాయి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.

కడుపు క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే ఎక్కువ స్టార్చ్, కార్బోహైడ్రేట్లు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ మాంసానికి దూరంగా ఉండటం ముఖ్యం. అంతే కాకుండా ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన వాటిని తినాలి. దినచర్యలో యోగా లేదా వ్యాయామాన్ని చేయాలి. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పెద్దప్రేగు కాన్సర్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories