Stone Patients: కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నాయా.. ఈ పండ్లు తింటే ఉపశమనం..!

Stone Patients Must Eat These Fruits No Need To Go To Hospital
x

Stone Patients: కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నాయా.. ఈ పండ్లు తింటే ఉపశమనం..!

Highlights

Stone Patients: ఈ రోజుల్లో కిడ్నీల్లో రాళ్లు రావడం చాలా సాధారణ సమస్యలా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

Stone Patients: ఈ రోజుల్లో కిడ్నీల్లో రాళ్లు రావడం చాలా సాధారణ సమస్యలా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారు ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. అయితే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

నీటి పండ్లు

రోజూ కొబ్బరి నీరు, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉండే పండ్లను తినాలి. ఎందుకంటే ఇవి రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. అలాగే ప్రతిరోజు నీరు ఎక్కువ తాగాలి.

సిట్రస్ పండ్లు తినాలి

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతాయి. సిట్రస్ పండ్లు, రసాలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. దీని కోసం నారింజ, బత్తాయి, ఉసిరి, ద్రాక్ వంటి పండ్లను తినాలి.

కాల్షియం ఆహారాలు తినకూడదు

మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే కాల్షియం అధికంగా ఉండే వాటిని తినకూడదు. ఆహారంలో నల్ల ద్రాక్ష, అత్తి పండ్లను చేర్చుకోవచ్చు. ఇవి కాకుండా దోసకాయను డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories