Health Tips: కిచెన్‌లో ఉండే ఈ మసాలతో కడుపు సమస్యలు దూరం..!

Stomach Problems go away with Asafoetida It is a Good Remedy for Gas and Constipation
x

Health Tips: కిచెన్‌లో ఉండే ఈ మసాలతో కడుపు సమస్యలు దూరం..!

Highlights

Health Tips: వంటగదిలో లభించే చాలా మసాలాలు వివిధ ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. మన పూర్వీకులు వీటిని ఉపయోగించి అనేక రోగాలను నయం చేసేవారు.

Health Tips: వంటగదిలో లభించే చాలా మసాలాలు వివిధ ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి. మన పూర్వీకులు వీటిని ఉపయోగించి అనేక రోగాలను నయం చేసేవారు. కొంతమంది ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లడం వల్ల ఆయల్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తింటారు. తర్వాత గ్యాస్‌, మలబద్దక సమస్యలతో బాధపడుతారు. ఇలాంటి పరిస్థితిలో కిచెన్‌లో ఉండే ఇంగువని ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఇంగువ వంటకాల రుచిని పెంచుతుంది. కడుపు, గుండె, దంతాల సమస్యలకు దివ్యౌషధం. కఫం తగ్గిస్తుంది. పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. పిత్త దోశాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి దోహదం చేస్తుంది. కొద్దిపాటి గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఇంగువ కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని నాభి చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేయాలి. దీనివల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

అలాగే ఇంగువ, దేశీ నెయ్యి కలయిక గ్యాస్, తిమ్మిరిని తగ్గిస్తుంది. ఇందుకోసం చిటికెడు ఇంగువ తీసుకుని దేశీ నెయ్యితో వేడి చేసి నాభి చుట్టూ మెత్తగా రాయాలి. కొంత సమయానికి ఉపశమనం పొందుతారు. అలాగే ఆవాలనూనె, ఇంగువ కలిపి పొట్టపై రాసుకుంటే కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని వృత్తాకారంలో తిప్పుతూ పొట్టపై అప్లై చేయాలి. పుల్లని తేన్పులు వస్తే ఛాతీపై రుద్దాలి. ఉపశమనం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories