Stomach Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఉదర క్యాన్సర్‌ అయ్యే అవకాశాలు..!

Stomach Cancer Symptoms Treatment Method More Things
x

Stomach Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఉదర క్యాన్సర్‌ అయ్యే అవకాశాలు..!

Highlights

Stomach Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఉదర క్యాన్సర్‌ అయ్యే అవకాశాలు..!

Stomach Cancer: పొట్టలో క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించినప్పుడు ఉదర క్యాన్సర్ సంభవిస్తుంది. దీనినే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చాలా మందికి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు అందుకే నిర్ధారణ చేయడం కష్టంగా ఉంటుంది. చాలా సందర్భాలలో ఉదర క్యాన్సర్ లక్షణాలు చివరి దశలో కనిపిస్తాయి. పెద్దప్రేగు క్యాన్సర్ సాధారణంగా పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్రారంభ దశలో పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు ఒకే రకంగా ఉండవు. కానీ మీరు కొన్ని లక్షణాలను చూస్తారు. ఈ పరిస్థితిలో వీటిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పర్వాలేదు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఉదర క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు ప్రారంభ దశలో వాంతులు, వికారం ఎదుర్కొంటారు. నిరంతరం ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కడుపులో ఉబ్బరం సమస్య ఉంటే పెద్దప్రేగు క్యాన్సర్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఛాతీ నొప్పి,తక్కువ తిన్నప్పటికీ పొట్ట నిండుగా ఉండడం ఉదర క్యాన్సర్‌ లక్షణాలుగా చెప్పవచ్చు. పొట్టలో ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ సమస్య ఉంటే ఆ వ్యక్తి జ్వరంతో బాధపడుతాడు.ఉదర క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు కడుపు నొప్పి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మలం నుంచి రక్తస్రావం ఉదర క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అతిసారం, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉదర క్యాన్సర్‌కి కారణం అవుతాయి.పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగి ఎర్ర రక్త కణాలు గణనీయంగా తగ్గడం ప్రారంభిస్తాయి. మీ శరీరంలో అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తద్వారా మీ చికిత్సను సమయానికి ప్రారంభించవచ్చు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories